ఇతిహాస సమానమైన కావ్యం
- ఓ.ఎన్.వి. కుర్రుప్
(జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత)
మలయాళ మహాకవి కుమారనాశాన్ రచించిన 'చింతావిష్ట ఐన సీత' ,వి. ఎస్. ఖండెడ్కర్ రచించిన యయాతి అనే మరాఠి కావ్యం, కసాండ్ సాక్కి రచించిన -ఒడీసీ- ఒక కొత్త అనుబంధం 'మొదలైనవి ఇతిహాస కధల వట్టి పునరాఖ్యానాలు కావని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా . అవి పునః సృష్టులు. ఒక సారి మాత్రమే గెల వేస్తుంది అరిటి చెట్టు. కానీ అరిటి చెట్టు క్రింద అరిటి మొక్కలని అలనాటి సేద్యగాళ్ళు చెప్పేవారు. ఎందుకంటే మట్టిలో దాగివున్న తల్లి దుంపనుంచి మళ్ళీ అరిటి మొక్కలు చిగురించి ఎదిగి గెల వేస్తాయి. ఇది ఆవర్తనల ఉనికి. కాని ఇతిహాసాల్లోనుంచి కొత్తగా చిగురులు తొడిగే రచనలు (పైన ప్రస్తావించిన రచనలలాంటివి) నూరు శాతం నూతన సృష్టులే.
కొన్ని పాత్రల స్వభావాలు నూతన సృష్టిలో పునరావిష్కృతమవుతాయి. పాత మూలము [TEXT] పైన కొత్తపాఠం లిఖించిన హస్తలిఖిత గ్రంధమలాంటిదని [PALMIST] చెప్పవచ్చు. ఇలాంటి రచన చేయడానికి కవికి ప్రేరణగా నిలిచేది కాలమే. ఇతిహాసాలు, ఎన్నెడూ సమకాలీన ప్రాసంగికతగల రచనలుగా మారడం కూడా ఇలాగే జరుగుతుంది కాలం గీసే కొత్త చిత్రానికి క్యాన్వాసూ రంగూ అవుతాయవి. ప్రభావర్మ గారు రచించిన శ్యామ మాధవం అనే గ్రంధం ఇలాంటిది. ఇతిహాస పురాణాల్లోకెల్లా అత్యంత సంక్లిష్టమూ శ్రద్దేయమూ ఐన పాత్ర శ్రీకృష్ణుడు. కృష్ణుని మనసులోకి రహస్యంగా ప్రవేశిస్తున్నాడు కవి. మరణశయ్య పైవున్న ఒక పాత్ర, తను చేసిన పొరపాట్ల గురించీ తప్పుల గురించీ చింతిస్తూ చేసే వివేచనాత్మకమైన పలుకులివి. పని కట్టుకొని విగ్రహాలను పగులు కొట్టే ప్రయత్నమేమి చేయలేదు, కానీ సంక్లిష్టమైన.....................
ఇతిహాస సమానమైన కావ్యం - ఓ.ఎన్.వి. కుర్రుప్ (జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత) మలయాళ మహాకవి కుమారనాశాన్ రచించిన 'చింతావిష్ట ఐన సీత' ,వి. ఎస్. ఖండెడ్కర్ రచించిన యయాతి అనే మరాఠి కావ్యం, కసాండ్ సాక్కి రచించిన -ఒడీసీ- ఒక కొత్త అనుబంధం 'మొదలైనవి ఇతిహాస కధల వట్టి పునరాఖ్యానాలు కావని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా . అవి పునః సృష్టులు. ఒక సారి మాత్రమే గెల వేస్తుంది అరిటి చెట్టు. కానీ అరిటి చెట్టు క్రింద అరిటి మొక్కలని అలనాటి సేద్యగాళ్ళు చెప్పేవారు. ఎందుకంటే మట్టిలో దాగివున్న తల్లి దుంపనుంచి మళ్ళీ అరిటి మొక్కలు చిగురించి ఎదిగి గెల వేస్తాయి. ఇది ఆవర్తనల ఉనికి. కాని ఇతిహాసాల్లోనుంచి కొత్తగా చిగురులు తొడిగే రచనలు (పైన ప్రస్తావించిన రచనలలాంటివి) నూరు శాతం నూతన సృష్టులే. కొన్ని పాత్రల స్వభావాలు నూతన సృష్టిలో పునరావిష్కృతమవుతాయి. పాత మూలము [TEXT] పైన కొత్తపాఠం లిఖించిన హస్తలిఖిత గ్రంధమలాంటిదని [PALMIST] చెప్పవచ్చు. ఇలాంటి రచన చేయడానికి కవికి ప్రేరణగా నిలిచేది కాలమే. ఇతిహాసాలు, ఎన్నెడూ సమకాలీన ప్రాసంగికతగల రచనలుగా మారడం కూడా ఇలాగే జరుగుతుంది కాలం గీసే కొత్త చిత్రానికి క్యాన్వాసూ రంగూ అవుతాయవి. ప్రభావర్మ గారు రచించిన శ్యామ మాధవం అనే గ్రంధం ఇలాంటిది. ఇతిహాస పురాణాల్లోకెల్లా అత్యంత సంక్లిష్టమూ శ్రద్దేయమూ ఐన పాత్ర శ్రీకృష్ణుడు. కృష్ణుని మనసులోకి రహస్యంగా ప్రవేశిస్తున్నాడు కవి. మరణశయ్య పైవున్న ఒక పాత్ర, తను చేసిన పొరపాట్ల గురించీ తప్పుల గురించీ చింతిస్తూ చేసే వివేచనాత్మకమైన పలుకులివి. పని కట్టుకొని విగ్రహాలను పగులు కొట్టే ప్రయత్నమేమి చేయలేదు, కానీ సంక్లిష్టమైన.....................© 2017,www.logili.com All Rights Reserved.