గుండు రహస్యమేమి గురవరాజా!
ఎస్వీ యూనివర్సిటీలో ఎమ్.ఏ తెలుగు ఫస్ట్ క్లాసు మార్కులతో పాస్ అయినాడు గురవరాజు. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఖాళీగా ఉండటం దేనికని ఇంటిలోనే ట్యూషన్లు చెప్పడం ప్రారంభించినాడు.
ప్రతిరోజూ తెల్లారి అయిదు గంటలకంతా లేస్తాడు. ఊర్లో పిల్లలకి ట్యూషన్ ప్రారంభిస్తాడు. ఏ సబ్జెక్టు అయినా, అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్లు చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. పిల్లోల్లు బడికన్నా గురవరాజు ట్యూషన్ అంటే ఎగబడే వాళ్ళు. రెండో శనివారం, ఆదివారం, పండుగ... ఏ రోజూ శెలవు లేదు, ప్రతి రోజూ ట్యూషన్ ఉండేది. అయినా అందరూ ఇష్టంగా వెళ్ళే వాళ్ళు. పిల్లోల్లు ఇచ్చే ట్యూషన్ డబ్బులను తీసుకునేటప్పుడు గురవరాజు ముఖం మిలమిలా మెరిసిపోయేది.
"నువ్వు కూడా వెళ్లి బాగా చదువుకోరా కిష్టా" అని అమ్మ ఒకటికి పదిసార్లు చెప్పింది. "బడిలో అయ్యోర్లు చెప్పేది భలే అర్థమవతా ఉంది, నాకెందుకే ట్యూషన్" అని కిష్టడు అమ్మ చేతికి దొరకకుండా చాన్నాళ్ళు తప్పించుకున్నాడు. ఊర్లోని వీధులన్నీ తిరిగి వీడు దేనికీ పనికి రాకుండా పోతాడనుకున్నారు అమ్మానాయన.
ఒకానొక రోజు అమ్మానాన్నలిద్దరూ కిష్టడిని బరబరా ఈడ్చుకు పోయి కూర్చోబెట్టినారు. పచ్చి మిరప కాయ కారం ముద్దలు మింగినోడు మాదిరి ముఖం పెట్టినాడు. అయితే పక్కనే.....................
గుండు రహస్యమేమి గురవరాజా! ఎస్వీ యూనివర్సిటీలో ఎమ్.ఏ తెలుగు ఫస్ట్ క్లాసు మార్కులతో పాస్ అయినాడు గురవరాజు. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఖాళీగా ఉండటం దేనికని ఇంటిలోనే ట్యూషన్లు చెప్పడం ప్రారంభించినాడు. ప్రతిరోజూ తెల్లారి అయిదు గంటలకంతా లేస్తాడు. ఊర్లో పిల్లలకి ట్యూషన్ ప్రారంభిస్తాడు. ఏ సబ్జెక్టు అయినా, అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్లు చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. పిల్లోల్లు బడికన్నా గురవరాజు ట్యూషన్ అంటే ఎగబడే వాళ్ళు. రెండో శనివారం, ఆదివారం, పండుగ... ఏ రోజూ శెలవు లేదు, ప్రతి రోజూ ట్యూషన్ ఉండేది. అయినా అందరూ ఇష్టంగా వెళ్ళే వాళ్ళు. పిల్లోల్లు ఇచ్చే ట్యూషన్ డబ్బులను తీసుకునేటప్పుడు గురవరాజు ముఖం మిలమిలా మెరిసిపోయేది. "నువ్వు కూడా వెళ్లి బాగా చదువుకోరా కిష్టా" అని అమ్మ ఒకటికి పదిసార్లు చెప్పింది. "బడిలో అయ్యోర్లు చెప్పేది భలే అర్థమవతా ఉంది, నాకెందుకే ట్యూషన్" అని కిష్టడు అమ్మ చేతికి దొరకకుండా చాన్నాళ్ళు తప్పించుకున్నాడు. ఊర్లోని వీధులన్నీ తిరిగి వీడు దేనికీ పనికి రాకుండా పోతాడనుకున్నారు అమ్మానాయన. ఒకానొక రోజు అమ్మానాన్నలిద్దరూ కిష్టడిని బరబరా ఈడ్చుకు పోయి కూర్చోబెట్టినారు. పచ్చి మిరప కాయ కారం ముద్దలు మింగినోడు మాదిరి ముఖం పెట్టినాడు. అయితే పక్కనే.....................© 2017,www.logili.com All Rights Reserved.