మనుషులందరినీ సమంగా ప్రేమించగలగడం ఒక సిద్ది అంటారు. తటస్థపడ్డ పుస్తకాలన్నిటిని అలాగే ఇష్టపడడం కూడా ఒక సిద్ధే. అది ఏ పుస్తకం కానివ్వండి. మీరు శ్రద్ధగా చదువుతున్నారు, ఇష్టంగా పరిచయం చేస్తున్నారు. మీకు పరిచయ కళ బాగా తెలిసింది. పుస్తకంలో ప్రధానమైన విషయాలన్నిటిని సారం ఎక్కడుందో పట్టుకుని సరళంగా ఏ రకమైన సందిగ్దతలు లేకుండా చెప్పుకుంటూ పోయే శక్తి అందరికి అబ్బదు.
- "అన్నవి.... అనుకున్నవి..." గ్రంధం గురించి డా రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు
* * *
మణిబాబు ఈ గ్రంథాన్ని చాలా నిశితంగా రాసాడు. వాల్యూమ్ కోసం కాకుండా వేల్యూ కోసం దృష్టి సారించాడు. ఇతనికి పరిశీలనా నైశిత్యం ఉంది. భావాభివ్యక్తి ఉంది. అనుభవం సమభావుకత్వం విడివిడిగా పెంపెసలారుతున్నాయి.
- " అందినంత చందమామ" గ్రంథం గురించి డా ఆవంత్స సోమసుందర్.
* * *
ఒక్కోసారి ఈ తాత్త్విక భావ సంచయం ఈ అబ్బాయికి ఎక్కడినుండి అబ్బిందనిపిస్తుంది. ఆశ్చర్యం వేస్తుంది. మణిబాబు విమర్శ అనుభూతి విమర్శ కావడంవల్ల అది పాఠకుడి విమర్శనానుభూతిని పూయిస్తుంది.
- - " అందినంత చందమామ" గ్రంథం గురించి శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ .