'విద్' అనుపదమునుండి వెలువడినది వేదము. 'విద్' అనగా తెలుసు కొనుట.
వేదము అనగా : విద్య, విజ్ఞానము, బ్రహ్మముఖమునుండి పుట్టిన శాస్త్రము. జీవరాసులు, మానవుల సృష్టి జరిగినతరువాత బ్రహ్మ తను సృష్టించిన జీవుల మనుగడ ఎలా కల్పించాలో తెలియక నారాయణుని ధ్యానించాడట. కొంతకాలము తరువాత అతనికుడి నాశికా కుహరము నుండి 'ఓం' అను శబ్దము వెలువడినదట. బ్రహ్మ 'ఓం'కారమునే ధ్యానము చేయగా, 'ఓంకారము' నుండి అనేక ఋక్కులు, యజస్సులు, సామములు వెలువడినవి.
ఋజుస్సులంటే ? మంత్రాలు
యజుస్సులంటే ?
యజస్సులు, యజ్ఞకర్మములు తెలియజేయుటను తెలుపు ప్రపాఠకములు.
సామములు అంటే ? పరమాత్మను స్తుతిస్తూ చేయుగానములు.
ఋక్కులు, యజస్సులు, సామములు కలిసి ఉండేవి.
వేదముల విభజన :
బ్రహ్మతను సృష్టించిన కృష్ణద్వైపాయనుని పిలిచి "నీకు వేదజ్ఞానము ప్రసాదిస్తున్నాను వేదములను ఒక క్రమములో విభజించమనెను.
నాల్గు వేదములుగ అవతరణ
అప్పుడు ఆ మహర్షి వేదజ్ఞానాన్ని మూడు భాగాలుగ మొదట విభజించినాడు.
© 2017,www.logili.com All Rights Reserved.