ఆధ్యాత్మికత అంటే అదేదో వేదాంతం, దాన్ని ఎప్పుడో అరవై సం||లు దాటినాక తెలుసుకోవాలి అని అందరం అనుకుంటూ ఉంటాం. అది మనందరి అవివేకమే. 60 సంవత్సరాలు దాటినాక చేద్దాం, చూద్దాం, నేర్చుకుందాం అని అనుకోవడం అంటే అది సాధ్యమయ్యే పని కూడా కాదు. కాళ్ళు, కీళ్ళు, బుద్ధి మనస్సు సక్రమంగా పనిచేస్తున్న సమయంలోనే ఆధ్యాత్మికం అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి మనం. అది మనకి అందని, అందుకోలేని విషయం కాదు. ఈ విషయం తెలుసుకోడానికి వయస్సుతో నిమిత్తం లేదు. వారివారి వాసనాబలం, వారివారి ఆసక్తులే నిమిత్తం. ఈ విషయాన్నే వేదవ్యాసుడు అనేక పురాణాల ద్వారా మనకి అందించాడు. వేదాంతర్గతములైన అనేక అంశాలను అనేక పురాణాలు మనకి వివరిస్తాయి. వాటిలో ఒకటి శ్రీ శివమహాపురాణము సంస్కృత భాషలో ఉన్న శివమహాపురాణములోని అంశాలను మనం తేలికైన, స్వచ్చమైన మన మాతృభాష అయిన మధురమైన తెలుగు భాషలో చదువుకునే ప్రయత్నం చేద్దాం.
- శ్రీమతి ప్రఖ్య లక్ష్మీ కనకదుర్గ
ఆధ్యాత్మికత అంటే అదేదో వేదాంతం, దాన్ని ఎప్పుడో అరవై సం||లు దాటినాక తెలుసుకోవాలి అని అందరం అనుకుంటూ ఉంటాం. అది మనందరి అవివేకమే. 60 సంవత్సరాలు దాటినాక చేద్దాం, చూద్దాం, నేర్చుకుందాం అని అనుకోవడం అంటే అది సాధ్యమయ్యే పని కూడా కాదు. కాళ్ళు, కీళ్ళు, బుద్ధి మనస్సు సక్రమంగా పనిచేస్తున్న సమయంలోనే ఆధ్యాత్మికం అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి మనం. అది మనకి అందని, అందుకోలేని విషయం కాదు. ఈ విషయం తెలుసుకోడానికి వయస్సుతో నిమిత్తం లేదు. వారివారి వాసనాబలం, వారివారి ఆసక్తులే నిమిత్తం. ఈ విషయాన్నే వేదవ్యాసుడు అనేక పురాణాల ద్వారా మనకి అందించాడు. వేదాంతర్గతములైన అనేక అంశాలను అనేక పురాణాలు మనకి వివరిస్తాయి. వాటిలో ఒకటి శ్రీ శివమహాపురాణము సంస్కృత భాషలో ఉన్న శివమహాపురాణములోని అంశాలను మనం తేలికైన, స్వచ్చమైన మన మాతృభాష అయిన మధురమైన తెలుగు భాషలో చదువుకునే ప్రయత్నం చేద్దాం. - శ్రీమతి ప్రఖ్య లక్ష్మీ కనకదుర్గ© 2017,www.logili.com All Rights Reserved.