శ్రీ మన్మహా మహీమండలమున భారతదేశం మిగుల పేరెన్నిక గన్నది. ఆదికాలమున వేదములీ పుణ్యభూమియందే వెలసినై. ఎందరెందఱో మహానుభావులిచట జన్మించిరి. ప్రపంచము నందెందును కనరాని; వినరాని; ఎనలేని పాతివ్రత్య మీ భారత స్త్రీలకే దక్కింది.
అనసూయ : సప్తఋషులలో అత్రిమహాముని భార్య అనసూయా దేవి ఉక్కు శనగలను గుగ్గిళ్ళుగ యుడికించి నారదునిచే తినిపించింది. మువ్వురు మూర్తులను ముద్దుపాపల జేసి జోలపాటతో నిద్రపుచ్చింది. ముగ్గురమ్మల మ్రొక్కులందుకొని పతిభిక్ష ప్రసాదించింది. త్రిలోకేశుల యంశగల దత్రాత్రేయుని తల్లియే పతివ్రతా శిరోమణిగ ప్రఖ్యాతి గాంచినది.
సావిత్రి : మద్ర దేశాధీశ్వరుడైన అశ్వపతి మహా రాజకుమార్తె సావిత్రీదేవి చితాశ్వనామము డయ్యు సత్యము పల్కుటయే సత్య వంతుడని పేరుగన్న ద్యుమత్సేన మహారాజ కుమారుని వివాహమాడి పెనిమిటి ప్రాణంబులు గొనిపోవుచున్న యముని వెంట నిర్భయముగ వైతరిణిని దాటి ప్రేతలోకమున కేగి సమవర్తిని మెప్పించి అత్తమామలకు నేత్రదృష్టితో పాటు రాజ్యప్రాప్తిని కలిగించి ప్రాణపతిని తిరిగి బ్రతికించు కొనిన పతివ్రతా తిలకముగ ప్రస్తుతు లందుకొన్నది.................
పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మవారి సంపూర్ణ చరిత్ర పాతివ్రత్య ప్రభావము శ్రీ మన్మహా మహీమండలమున భారతదేశం మిగుల పేరెన్నిక గన్నది. ఆదికాలమున వేదములీ పుణ్యభూమియందే వెలసినై. ఎందరెందఱో మహానుభావులిచట జన్మించిరి. ప్రపంచము నందెందును కనరాని; వినరాని; ఎనలేని పాతివ్రత్య మీ భారత స్త్రీలకే దక్కింది. అనసూయ : సప్తఋషులలో అత్రిమహాముని భార్య అనసూయా దేవి ఉక్కు శనగలను గుగ్గిళ్ళుగ యుడికించి నారదునిచే తినిపించింది. మువ్వురు మూర్తులను ముద్దుపాపల జేసి జోలపాటతో నిద్రపుచ్చింది. ముగ్గురమ్మల మ్రొక్కులందుకొని పతిభిక్ష ప్రసాదించింది. త్రిలోకేశుల యంశగల దత్రాత్రేయుని తల్లియే పతివ్రతా శిరోమణిగ ప్రఖ్యాతి గాంచినది. సావిత్రి : మద్ర దేశాధీశ్వరుడైన అశ్వపతి మహా రాజకుమార్తె సావిత్రీదేవి చితాశ్వనామము డయ్యు సత్యము పల్కుటయే సత్య వంతుడని పేరుగన్న ద్యుమత్సేన మహారాజ కుమారుని వివాహమాడి పెనిమిటి ప్రాణంబులు గొనిపోవుచున్న యముని వెంట నిర్భయముగ వైతరిణిని దాటి ప్రేతలోకమున కేగి సమవర్తిని మెప్పించి అత్తమామలకు నేత్రదృష్టితో పాటు రాజ్యప్రాప్తిని కలిగించి ప్రాణపతిని తిరిగి బ్రతికించు కొనిన పతివ్రతా తిలకముగ ప్రస్తుతు లందుకొన్నది.................© 2017,www.logili.com All Rights Reserved.