కలియుగమునందు శ్రీసత్యనారాయణస్వామి వ్రతము అనేకానేక శుభఫలముల నిచ్చునని, కోర్కెలను తీర్చునని పురాణములలో చెప్పబడినది. అనాదిగా శ్రీ సత్య నారాయణస్వామివారి వ్రతమును భక్తులు అనేకానేక సందర్భములలో స్వామివారి అనుగ్రహమును పొందుటకై ఆచరించడము ఒక సాంప్రదాయికముగా నున్నది. స్వల్పమైన తేడాలు ఉన్నప్పటికీ, వ్రత విధానము ఇంచుమించు ఒకే విధముగానే ఉంటుంది. వైదిక లేదా పౌరాణిక విధానములలో విహితమైన విధిని ఈ వ్రతాచరణము స్వామివారి అనుగ్రహమును, మనోవాంఛితములను సంపూర్ణముగా నొసంగుననుటకు సందేహమే అక్కరలేదు. శక్తికి పరిమితులున్ననూ, భక్తికి లేవు కదా! నిరాడంబరమైన, పరిపూర్ణమైన భక్తిప్రపత్తులే వ్రతాచరణములో ప్రధానము, విధానము.
ఈ వ్రతవిధానము నెఱుకపఱచు గ్రంథము లలభ్యములు కాకున్నప్పటికీ, స్వర సహిత మనము, స్థలితరహిత పద, శ్లోక సహితముగా నొక నిర్దుష్ట స్వయంబోధిని వంటి గ్రంథము యున్నచో సౌలభ్యముగా నుండుననిన అనేకాభిలాషుల కోరికను స్వామి సఙ్కల్పముగా శిరసావహించి ఈ గ్రంథమును కూర్చడమైనది. అంతియే కాని యిదియే సప్రమాణమని మాత్రము కాదు. శ్లోక మన్రోచ్చారణములు చేయునపుడు స్వర, శబ్దస్వరూప, అర్థ, జ్ఞానమును కలిగియుండుట అత్యావశ్యకము. "అర్థము", "అర్ధము"లకు కల భేదమును తెలియకున్నచో నది యనర్థదాయకమగును. ప్రయత్నలోపము లేనప్పటికీ దోషములు దొరలిన సందర్భములు క్షంతవ్యము. "ప్రమాదో ధీమతామపి" అన్న లోకోక్తికి ఎవ్వరునూ అతీతులు కారు కదా!
భక్తశిఖామణులకు వ్రతాచరణములో ఈ పొత్తము మార్గదర్శకమై, వారు శ్రీ రమా సహిత సత్యనారాయణస్వామి వారి సంపూర్ణానుగ్రహలబ్ధులై, కల్పోక్త మనోవాంఛి తములను పొందవలయునని శ్రీసత్యనారాయణస్వామి వారికి మదీయ భక్తిపూర్వక విన్నపము...................
ముందుమాట శ్రీ గురుభ్యో నమఃశ్రీ సత్యనారాయణస్వామినే నమః కలియుగమునందు శ్రీసత్యనారాయణస్వామి వ్రతము అనేకానేక శుభఫలముల నిచ్చునని, కోర్కెలను తీర్చునని పురాణములలో చెప్పబడినది. అనాదిగా శ్రీ సత్య నారాయణస్వామివారి వ్రతమును భక్తులు అనేకానేక సందర్భములలో స్వామివారి అనుగ్రహమును పొందుటకై ఆచరించడము ఒక సాంప్రదాయికముగా నున్నది. స్వల్పమైన తేడాలు ఉన్నప్పటికీ, వ్రత విధానము ఇంచుమించు ఒకే విధముగానే ఉంటుంది. వైదిక లేదా పౌరాణిక విధానములలో విహితమైన విధిని ఈ వ్రతాచరణము స్వామివారి అనుగ్రహమును, మనోవాంఛితములను సంపూర్ణముగా నొసంగుననుటకు సందేహమే అక్కరలేదు. శక్తికి పరిమితులున్ననూ, భక్తికి లేవు కదా! నిరాడంబరమైన, పరిపూర్ణమైన భక్తిప్రపత్తులే వ్రతాచరణములో ప్రధానము, విధానము. ఈ వ్రతవిధానము నెఱుకపఱచు గ్రంథము లలభ్యములు కాకున్నప్పటికీ, స్వర సహిత మనము, స్థలితరహిత పద, శ్లోక సహితముగా నొక నిర్దుష్ట స్వయంబోధిని వంటి గ్రంథము యున్నచో సౌలభ్యముగా నుండుననిన అనేకాభిలాషుల కోరికను స్వామి సఙ్కల్పముగా శిరసావహించి ఈ గ్రంథమును కూర్చడమైనది. అంతియే కాని యిదియే సప్రమాణమని మాత్రము కాదు. శ్లోక మన్రోచ్చారణములు చేయునపుడు స్వర, శబ్దస్వరూప, అర్థ, జ్ఞానమును కలిగియుండుట అత్యావశ్యకము. "అర్థము", "అర్ధము"లకు కల భేదమును తెలియకున్నచో నది యనర్థదాయకమగును. ప్రయత్నలోపము లేనప్పటికీ దోషములు దొరలిన సందర్భములు క్షంతవ్యము. "ప్రమాదో ధీమతామపి" అన్న లోకోక్తికి ఎవ్వరునూ అతీతులు కారు కదా! భక్తశిఖామణులకు వ్రతాచరణములో ఈ పొత్తము మార్గదర్శకమై, వారు శ్రీ రమా సహిత సత్యనారాయణస్వామి వారి సంపూర్ణానుగ్రహలబ్ధులై, కల్పోక్త మనోవాంఛి తములను పొందవలయునని శ్రీసత్యనారాయణస్వామి వారికి మదీయ భక్తిపూర్వక విన్నపము...................© 2017,www.logili.com All Rights Reserved.