ఆచార్య సిద్ధ నాగార్జునుని చారిత్రక ప్రకరణము
పారిపోయిన బ్రాహ్మణ కుమారుడు
త్రిలింగ దేశ మది! పలనాటి పోతుగడ్డలో... ఓ పల్లెటూరు! నిత్యము వేదములు వల్లించబడే బ్రాహ్మణ వాడ! అదే "వేదవల్లి" గ్రామము ! వేదములు వల్లించబడే ఊరు గనుక "వేదవల్లి" అయినది. అదే కాల క్రమేణా... పల్లె ప్రజల మాటలలో కాఠిన్యమును కోల్పోయి, జానపదుల మనస్సులలో మెత్తబడి 'వేదలి' అయినది.
ఇంకా సూర్యోదయము కాలేదు. బ్రాహ్మణ వటువులు నిద్రలేచి నిత్య కృత్యములలో ప్రవేశించారు. ఏడేళ్ళ బాలుడు- తెల్లటి మేనిచ్చాయ. ఎత్తైన విగ్రహము, వయసుకు మించిన శరీర సౌష్ఠవము, వీపు మీద సన్నటి తెల్ల త్రాచుపాములా మెలితిరిగి ఉన్న యజ్ఞోపవీతము! చూచుటకు అతడి వెన్నును కాపాడే సర్ప శిశువులా ఉన్నది అది !!
ఆ బాలుడు- ఊరి చివరి చెఱువు దగ్గఱకు వెళ్ళి, స్నానమును చేసాడు. ఆ చెఱువు చుట్టూ ఉన్న వెదురు పొదలు, వంశీ నికుంజముల నుండి... మెల్లగా వీస్తున్న గాలి కూడ... వేద ఘోషనే వినిపిస్తున్నది. అర్ఘ్యమును వదిలాడు. బాల భానుని అరుణ కిరణములు ప్రతిబింబించి... ఆ నీటి బిందువులు- స్ఫటికము వలె తళ తళా మెఱసాయి.
. స్వచ్ఛమైన ఉచ్చారణతో గాయత్రీ మంత్రమును చదివాడు- ఆబాలుడు!.....................
ఆచార్య సిద్ధ నాగార్జునుని చారిత్రక ప్రకరణము పారిపోయిన బ్రాహ్మణ కుమారుడు త్రిలింగ దేశ మది! పలనాటి పోతుగడ్డలో... ఓ పల్లెటూరు! నిత్యము వేదములు వల్లించబడే బ్రాహ్మణ వాడ! అదే "వేదవల్లి" గ్రామము ! వేదములు వల్లించబడే ఊరు గనుక "వేదవల్లి" అయినది. అదే కాల క్రమేణా... పల్లె ప్రజల మాటలలో కాఠిన్యమును కోల్పోయి, జానపదుల మనస్సులలో మెత్తబడి 'వేదలి' అయినది. ఇంకా సూర్యోదయము కాలేదు. బ్రాహ్మణ వటువులు నిద్రలేచి నిత్య కృత్యములలో ప్రవేశించారు. ఏడేళ్ళ బాలుడు- తెల్లటి మేనిచ్చాయ. ఎత్తైన విగ్రహము, వయసుకు మించిన శరీర సౌష్ఠవము, వీపు మీద సన్నటి తెల్ల త్రాచుపాములా మెలితిరిగి ఉన్న యజ్ఞోపవీతము! చూచుటకు అతడి వెన్నును కాపాడే సర్ప శిశువులా ఉన్నది అది !! ఆ బాలుడు- ఊరి చివరి చెఱువు దగ్గఱకు వెళ్ళి, స్నానమును చేసాడు. ఆ చెఱువు చుట్టూ ఉన్న వెదురు పొదలు, వంశీ నికుంజముల నుండి... మెల్లగా వీస్తున్న గాలి కూడ... వేద ఘోషనే వినిపిస్తున్నది. అర్ఘ్యమును వదిలాడు. బాల భానుని అరుణ కిరణములు ప్రతిబింబించి... ఆ నీటి బిందువులు- స్ఫటికము వలె తళ తళా మెఱసాయి. . స్వచ్ఛమైన ఉచ్చారణతో గాయత్రీ మంత్రమును చదివాడు- ఆబాలుడు!.....................© 2017,www.logili.com All Rights Reserved.