శ్రీః
ప్రథమోధ్యాయః
ఓం
పరమదేవతాయై నమః | శ్రీగురవే నమః |
కైలాశశిఖరారూఢం దేవదేవం జగద్గురుమ్ ||
సదా స్మేరముఖీ దుర్గా పప్రచ్ఛ నగనన్దినీ ॥
ప్రతిపదార్థం : సదా = ఎల్లప్పుడూ, స్మేరముఖీ = చిఱునవ్వు ముఖమునగల, దుర్గా = దుర్గయగు, నగనన్దినీ = హైమావతి, పార్వతి, కైలాశశిఖరారూఢమ్ = కైలాసపర్వతాగ్రాన నెలకొన్న, జగద్గురుమ్ = జగత్తునకు జ్ఞానమునిచ్చు, దేవదేవమ్ = : దేవతారాధ్యుడైన, దేవుడగు శివుని, పప్రచ్ఛ = అడిగెను.
తాత్పర్యం : కైలాసశిఖరవాసియైన జగద్గురుని దేవదేవుని ఎప్పుడూ నగుమోముగల హిమవత్ప్ర్పుత్రి దుర్గ ఈ విధంగా అడిగింది.
శివుడు జ్ఞానదాత కనుక జగద్గురువు. కైలాసశిఖరం వీని నెలవు. శివునితో కలిసియున్న పార్వతి ఆనందమూర్తియే. కనుకే హైమావతిగా హిమవంతునికి ఆనందదాయిని యైనది. నగుమోముతో విరాజిల్లుతూన్నది. భక్తసులభమైనది. ఆమె దుర్గ, చేరరానిది.
=
శ్రీదేవ్యువాచ | : శ్రీదేవీ = మహాదేవుని ఇల్లాలు, ఉవాచ =
ఇట్లన్నది.
చతుఃషష్టి చ తస్త్రాణి కృతాని భవతా ప్రభో! ॥
తేషాం మధ్యే ప్రధానాని వద మే కరుణానిధే! ॥
ప్రతిపదార్థం : ప్రభో! = స్వామీ!, భవతా = తమచేత, చతుఃషష్టి = అరువదినాలుగు, తన్రాణి = తంత్రములు, కృతాని = చేయబడినవి, చ = మఱియు, తేషాం మధ్యే : వానిలో, ప్రధానాని = ముఖ్యమైన వానిని, కరుణానిధే! = దయాసముద్రా!, మే = నాకు వద = చెప్పుము.
=
తాత్పర్యం : స్వామీ! తమరు అరువదినాలుగు తనాలను నిర్మించినారు కదా, వానిలో ముఖ్యమైనవానిని దయతో నాకు చెప్పండి.........
శ్రీః ప్రథమోధ్యాయః ఓం పరమదేవతాయై నమః | శ్రీగురవే నమః | కైలాశశిఖరారూఢం దేవదేవం జగద్గురుమ్ || సదా స్మేరముఖీ దుర్గా పప్రచ్ఛ నగనన్దినీ ॥ ప్రతిపదార్థం : సదా = ఎల్లప్పుడూ, స్మేరముఖీ = చిఱునవ్వు ముఖమునగల, దుర్గా = దుర్గయగు, నగనన్దినీ = హైమావతి, పార్వతి, కైలాశశిఖరారూఢమ్ = కైలాసపర్వతాగ్రాన నెలకొన్న, జగద్గురుమ్ = జగత్తునకు జ్ఞానమునిచ్చు, దేవదేవమ్ = : దేవతారాధ్యుడైన, దేవుడగు శివుని, పప్రచ్ఛ = అడిగెను. తాత్పర్యం : కైలాసశిఖరవాసియైన జగద్గురుని దేవదేవుని ఎప్పుడూ నగుమోముగల హిమవత్ప్ర్పుత్రి దుర్గ ఈ విధంగా అడిగింది. శివుడు జ్ఞానదాత కనుక జగద్గురువు. కైలాసశిఖరం వీని నెలవు. శివునితో కలిసియున్న పార్వతి ఆనందమూర్తియే. కనుకే హైమావతిగా హిమవంతునికి ఆనందదాయిని యైనది. నగుమోముతో విరాజిల్లుతూన్నది. భక్తసులభమైనది. ఆమె దుర్గ, చేరరానిది. = శ్రీదేవ్యువాచ | : శ్రీదేవీ = మహాదేవుని ఇల్లాలు, ఉవాచ = ఇట్లన్నది. చతుఃషష్టి చ తస్త్రాణి కృతాని భవతా ప్రభో! ॥ తేషాం మధ్యే ప్రధానాని వద మే కరుణానిధే! ॥ప్రతిపదార్థం : ప్రభో! = స్వామీ!, భవతా = తమచేత, చతుఃషష్టి = అరువదినాలుగు, తన్రాణి = తంత్రములు, కృతాని = చేయబడినవి, చ = మఱియు, తేషాం మధ్యే : వానిలో, ప్రధానాని = ముఖ్యమైన వానిని, కరుణానిధే! = దయాసముద్రా!, మే = నాకు వద = చెప్పుము. = తాత్పర్యం : స్వామీ! తమరు అరువదినాలుగు తనాలను నిర్మించినారు కదా, వానిలో ముఖ్యమైనవానిని దయతో నాకు చెప్పండి.........© 2017,www.logili.com All Rights Reserved.