భగవంతుడు మతాలను సృష్టించలేదు. అందమైన ప్రకృతిని, ప్రేమకి ప్రతిరూపాలైన మనుషుల్ని, పక్షుల్ని, మృగాల్ని సృష్టించాడు. మనిషిలో 'జ్ఞానం' అనే అద్భుతశక్తిని పొదిగాడు. అది సద్వినియోగం చేస్తే స్వర్గం. దుర్వినియోగం చేస్తే నరకం. స్వర్గ - నరకాలు సృష్టించుకోగల శక్తి మానవునికి ఉంది. నరకం సృష్టించుకున్నప్పుడల్లా భగవంతుడు మానవుల ఆత్మలను శుద్ధి చేసేందుకు ఒక దైవ సేవకుడైన ప్రవక్తని, మహాత్ముని భూలోకానికి పంపిస్తాడు. జీసస్, మహ్మద్, గురునానక్, భగవాన్ శ్రీరమణులు అలా వచ్చిన వారే. మత సామరస్యానికి జీవితం ధారాపోసిన సద్గురువు షిరిడీసాయి పిలిస్తే పలికే దైవం.
ఇస్లాంలో తల్లి ప్రాధాన్యత, మత సామరస్యతలను ఇతివృత్తానికి పునాదిగా తీసుకుని రచన చేశాను. పాఠక మిత్రుల ప్రశంసలు లభించటం నాకు చాలా ఆనందాన్ని, తృప్తినీ కలిగించాయి. 'అమ్మీజాన్' పుస్తక రూపంలో వస్తే బావుంటుందని చాలా మంది పాఠకులు ఆకాంక్షించారు. సాహితి లక్ష్మిగారు ఆ ఆకాంక్షను నేరవేర్చారు. అందుకు ఆమెకు నా మనఃపూర్వక అభినందనలు.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
భగవంతుడు మతాలను సృష్టించలేదు. అందమైన ప్రకృతిని, ప్రేమకి ప్రతిరూపాలైన మనుషుల్ని, పక్షుల్ని, మృగాల్ని సృష్టించాడు. మనిషిలో 'జ్ఞానం' అనే అద్భుతశక్తిని పొదిగాడు. అది సద్వినియోగం చేస్తే స్వర్గం. దుర్వినియోగం చేస్తే నరకం. స్వర్గ - నరకాలు సృష్టించుకోగల శక్తి మానవునికి ఉంది. నరకం సృష్టించుకున్నప్పుడల్లా భగవంతుడు మానవుల ఆత్మలను శుద్ధి చేసేందుకు ఒక దైవ సేవకుడైన ప్రవక్తని, మహాత్ముని భూలోకానికి పంపిస్తాడు. జీసస్, మహ్మద్, గురునానక్, భగవాన్ శ్రీరమణులు అలా వచ్చిన వారే. మత సామరస్యానికి జీవితం ధారాపోసిన సద్గురువు షిరిడీసాయి పిలిస్తే పలికే దైవం. ఇస్లాంలో తల్లి ప్రాధాన్యత, మత సామరస్యతలను ఇతివృత్తానికి పునాదిగా తీసుకుని రచన చేశాను. పాఠక మిత్రుల ప్రశంసలు లభించటం నాకు చాలా ఆనందాన్ని, తృప్తినీ కలిగించాయి. 'అమ్మీజాన్' పుస్తక రూపంలో వస్తే బావుంటుందని చాలా మంది పాఠకులు ఆకాంక్షించారు. సాహితి లక్ష్మిగారు ఆ ఆకాంక్షను నేరవేర్చారు. అందుకు ఆమెకు నా మనఃపూర్వక అభినందనలు. - కాటూరు రవీంద్ర త్రివిక్రమ్© 2017,www.logili.com All Rights Reserved.