ఈ భూమి, దానిపై ఉండే పర్యావరణం పదిలంగా ఉండాలి. లేకుంటే ఇప్పటికి అంతరించిపోయిన, అంతరించిపోతున్న లక్షలాది ప్రాణులతో పాటు మానవ మనుగడకే ప్రమాదం ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. ప్రకృతిలో వచ్చే వాతావరణ మార్పులకు మానవుడే కారణం. కనుక మానవుడే ప్రథమ ముద్దాయి అని చెప్పవచ్చు. జీవానికి ప్రాణాధారమైన నీటిని తోడేస్తూ భూగర్భ జలాలు అడుగంటేలా చేస్తున్నాడు. హైడ్రోకార్బన్లు, భారీ ఖనిజాలు, క్రిమి సంహారకాలు అన్నీ కలిసి భూమిపైన మట్టిని కలుషితం చేస్తున్నాయి. అలాగే వాయు కాలుష్యానికి ప్రధాన కారణం వాతావరణంలోని రసాయనాలు, హాని కారక పరమాణువులను విడుదల చెయ్యడం, పరిశ్రమలు, మోటారు వాహనాలు మొదలైనవి గాలిని కలుషితం చేస్తున్నాయి. ఈ కలుషిత వాయువుల ద్వారా ఓజోన్ పోర దెబ్బతిని మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. విచ్చలవిడిగా ప్రతి ప్రాణిని హింసించి వాటి మనుగడే ప్రమాదంలో పడే విధంగా మనిషి ప్రవర్తన ఉంది. పక్షులు, వృక్షాలు, జంతుజాతులు ఇలా ప్రకృతికి అలంకారమైన ప్రతి ప్రాణిని అంతరించిపోయే స్థాయికి తీసుకొచ్చాడు.
ఈ భూగ్రహం మన సేవలను కోరుతుంది. వాతావరణ మార్పులను ఆపడానికి ఏకం కావాలని అందుకై భూమిపై పచ్చని నగరాలు; ఎడారులు, ఎడారేతర మెట్టభూములను ఎడారులుగా మార్చవద్దని, సముద్రాలను కాపాడుదాం అని భూమి తన సందేశాలను పంపుతుంది. అందుకే ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ భాదహ్యతను గుర్తించాలనేది నా అభిలాష.
- బిళ్ళా జవహర్ బాబు
ఈ భూమి, దానిపై ఉండే పర్యావరణం పదిలంగా ఉండాలి. లేకుంటే ఇప్పటికి అంతరించిపోయిన, అంతరించిపోతున్న లక్షలాది ప్రాణులతో పాటు మానవ మనుగడకే ప్రమాదం ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. ప్రకృతిలో వచ్చే వాతావరణ మార్పులకు మానవుడే కారణం. కనుక మానవుడే ప్రథమ ముద్దాయి అని చెప్పవచ్చు. జీవానికి ప్రాణాధారమైన నీటిని తోడేస్తూ భూగర్భ జలాలు అడుగంటేలా చేస్తున్నాడు. హైడ్రోకార్బన్లు, భారీ ఖనిజాలు, క్రిమి సంహారకాలు అన్నీ కలిసి భూమిపైన మట్టిని కలుషితం చేస్తున్నాయి. అలాగే వాయు కాలుష్యానికి ప్రధాన కారణం వాతావరణంలోని రసాయనాలు, హాని కారక పరమాణువులను విడుదల చెయ్యడం, పరిశ్రమలు, మోటారు వాహనాలు మొదలైనవి గాలిని కలుషితం చేస్తున్నాయి. ఈ కలుషిత వాయువుల ద్వారా ఓజోన్ పోర దెబ్బతిని మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. విచ్చలవిడిగా ప్రతి ప్రాణిని హింసించి వాటి మనుగడే ప్రమాదంలో పడే విధంగా మనిషి ప్రవర్తన ఉంది. పక్షులు, వృక్షాలు, జంతుజాతులు ఇలా ప్రకృతికి అలంకారమైన ప్రతి ప్రాణిని అంతరించిపోయే స్థాయికి తీసుకొచ్చాడు. ఈ భూగ్రహం మన సేవలను కోరుతుంది. వాతావరణ మార్పులను ఆపడానికి ఏకం కావాలని అందుకై భూమిపై పచ్చని నగరాలు; ఎడారులు, ఎడారేతర మెట్టభూములను ఎడారులుగా మార్చవద్దని, సముద్రాలను కాపాడుదాం అని భూమి తన సందేశాలను పంపుతుంది. అందుకే ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ భాదహ్యతను గుర్తించాలనేది నా అభిలాష. - బిళ్ళా జవహర్ బాబు© 2017,www.logili.com All Rights Reserved.