కలల దారిలో...
భారత క్షిపణి పితామహుడు అబ్దుల్ కలాం యువతరం గుండెల్లో దివ్యాగ్నిని రగిల్చిన వ్యక్తిగా, జిజ్ఞాస అనే దీపాన్ని ఎగసనదోసి, విజ్ఞానపు వెలుగులు పంచిన మహానీయునిగా చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించారు. యువతరం ఆయన మాటలతో మంత్రంముగ్ధమైంది. ఆధునిక కాలంలో యువతరాన్ని భారతరత్న కాలంలా ప్రభావితం చేసిన వ్యక్తీ లేరంటే అతిశయోక్తి లేదు. సామాన్యమైన కుటుంబంలో పుట్టి రాష్ట్రపతిగా ఎదిగిన కలాం ఆలోచనలు, భావాలు ముందు తరాలకు కూడా ఆదర్శప్రాయమైనవి. నిజాయితీ, రుజువార్తన, నిరంతర కృషి, దేశభక్తీ, విలువలే పంచప్రాణాలుగా ఎదిగిన అబ్దుల్ కలాం జీవితం నిత్యపారాయణ గ్రంథం.
కలాం ఆశయాల సాధనలో, ఆయన కలలు కన్న భారతదేశాన్ని సాకారం చేయడానికి డా టి ఎస్ రావుగారు అందిస్తున్న 'కలలు కందాం... నిజం చేద్దాం' తనవంతు పాత్ర పోషిస్తుంది. యువతరం కోసం ఎప్పటికప్పుడు విన్నూత్నమైన ఆలోచనలతో రచనలు వెలువరించే నా అభిమాన రచయిత డా టి ఎస్ రావుగారికి ఈ పుస్తకం విడుదల సందర్భంగా నా అభినందలు అందిస్తున్నాను. ఇది మీ అందరికీ తప్పక నచ్చుతుందని, కలాం స్మృతిని చిరస్థాయి చేస్తుందని విశ్వసిస్తున్నాను.
కలల దారిలో... భారత క్షిపణి పితామహుడు అబ్దుల్ కలాం యువతరం గుండెల్లో దివ్యాగ్నిని రగిల్చిన వ్యక్తిగా, జిజ్ఞాస అనే దీపాన్ని ఎగసనదోసి, విజ్ఞానపు వెలుగులు పంచిన మహానీయునిగా చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించారు. యువతరం ఆయన మాటలతో మంత్రంముగ్ధమైంది. ఆధునిక కాలంలో యువతరాన్ని భారతరత్న కాలంలా ప్రభావితం చేసిన వ్యక్తీ లేరంటే అతిశయోక్తి లేదు. సామాన్యమైన కుటుంబంలో పుట్టి రాష్ట్రపతిగా ఎదిగిన కలాం ఆలోచనలు, భావాలు ముందు తరాలకు కూడా ఆదర్శప్రాయమైనవి. నిజాయితీ, రుజువార్తన, నిరంతర కృషి, దేశభక్తీ, విలువలే పంచప్రాణాలుగా ఎదిగిన అబ్దుల్ కలాం జీవితం నిత్యపారాయణ గ్రంథం. కలాం ఆశయాల సాధనలో, ఆయన కలలు కన్న భారతదేశాన్ని సాకారం చేయడానికి డా టి ఎస్ రావుగారు అందిస్తున్న 'కలలు కందాం... నిజం చేద్దాం' తనవంతు పాత్ర పోషిస్తుంది. యువతరం కోసం ఎప్పటికప్పుడు విన్నూత్నమైన ఆలోచనలతో రచనలు వెలువరించే నా అభిమాన రచయిత డా టి ఎస్ రావుగారికి ఈ పుస్తకం విడుదల సందర్భంగా నా అభినందలు అందిస్తున్నాను. ఇది మీ అందరికీ తప్పక నచ్చుతుందని, కలాం స్మృతిని చిరస్థాయి చేస్తుందని విశ్వసిస్తున్నాను.© 2017,www.logili.com All Rights Reserved.