ఇరవయ్యేళ్ళ పై చిలుకు వయసున్న వరుణ్ ఆటల్ని మారుస్తూ, ఆడుకోవాలనే ధోరణిలో ఉంటాడు. 9 -5 గంటల మధ్య ఒక చట్రంలో పని చేయడానికి ఎంతమాత్రం ఇష్టపడదు. వ్యాపారవేత్త కావాలని కలలు కంటాడు. ఇష్టంలేని ఇంజనీరింగ్ డిగ్రీని చేతిలో ఉంచుకొని, తన సమయాన్నంతా స్నేహితులతోను, పబ్బుల్లోను కులాసాగా గడపడంతోను, తను మనసుపడ్డ అమ్మాయిని ఫేస్ బుక్ లో అనుసరించడంతోను గడిపేస్తుంటాడు... అనూ ఆంటీ రంగంలో ప్రవేశించే వరకూ వరుణ్ దినచర్య ఇలాగే ఉండేది. అనూ ఆంటీ తన సుతిమెత్తని సుత్తిదేబ్బల్లాంటి మాటల ఈటెలతో, కొండొకచో పథకాలతో అతగాణ్ణి 'దారి'లోకి తీసుకొచ్చింది.
పద్మవ్యూహంలో చిక్కుకున్న ఆటను అనూ ఆంటీని ఆమె అడిగిన ఆటలోనే అష్టదిగ్భంధనం చేసే వ్యూహాన్ని ప్రయోగిస్తాడు. ఈ క్రమంలో అతను ఈ - కామర్స్ స్టోర్ నిర్వహించడం గురించి, తన తల్లి ఏర్పాటు చేసే కిట్టీ పార్టీలను పరీశీలించడం ద్వారా అత్యంత కీలకమైన వ్యాపార పాఠాలను ఒంటబట్టించుకుంటాడు. జోరుగా హుషారుగా సాగే వరుణ్ వ్యాపార ప్రయాణాన్ని ఆస్వాదించండి - చిత్తు కాగితం మీద వ్యాపార ప్రణాళికను రచించడం దగ్గర్నుంచి, నిధుల సమీకరణలో ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమిస్తూ, తనని సాదాసీదా సేల్స్ మేన్ గా ఎగతాళి చెయ్యబడే వరకు ఈ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
అడ్డంకులన్నింటినీ ఎదుర్కొని మిలియన్ డాలర్ కంపెనీ వ్యవస్థాపించడంలో వరుణ్ విజయం సాధిస్తాడా? లేదా అనూ ఆంటీ ముసిముసిగా నవ్వుకుంటుందా?. తమ అభిరుచిని వృత్తిగా మలచుకోవాలనే వారంతా వరుణ్ విజయగాధను తప్పనిసరిగా చదవాల్సిందే. హాస్యం, వ్యంగ్యంతోబాటు గోరుముద్దలలాంటి వివేకం మనకి చక్కిలిగింతలు పెడతాయి.
ఇరవయ్యేళ్ళ పై చిలుకు వయసున్న వరుణ్ ఆటల్ని మారుస్తూ, ఆడుకోవాలనే ధోరణిలో ఉంటాడు. 9 -5 గంటల మధ్య ఒక చట్రంలో పని చేయడానికి ఎంతమాత్రం ఇష్టపడదు. వ్యాపారవేత్త కావాలని కలలు కంటాడు. ఇష్టంలేని ఇంజనీరింగ్ డిగ్రీని చేతిలో ఉంచుకొని, తన సమయాన్నంతా స్నేహితులతోను, పబ్బుల్లోను కులాసాగా గడపడంతోను, తను మనసుపడ్డ అమ్మాయిని ఫేస్ బుక్ లో అనుసరించడంతోను గడిపేస్తుంటాడు... అనూ ఆంటీ రంగంలో ప్రవేశించే వరకూ వరుణ్ దినచర్య ఇలాగే ఉండేది. అనూ ఆంటీ తన సుతిమెత్తని సుత్తిదేబ్బల్లాంటి మాటల ఈటెలతో, కొండొకచో పథకాలతో అతగాణ్ణి 'దారి'లోకి తీసుకొచ్చింది. పద్మవ్యూహంలో చిక్కుకున్న ఆటను అనూ ఆంటీని ఆమె అడిగిన ఆటలోనే అష్టదిగ్భంధనం చేసే వ్యూహాన్ని ప్రయోగిస్తాడు. ఈ క్రమంలో అతను ఈ - కామర్స్ స్టోర్ నిర్వహించడం గురించి, తన తల్లి ఏర్పాటు చేసే కిట్టీ పార్టీలను పరీశీలించడం ద్వారా అత్యంత కీలకమైన వ్యాపార పాఠాలను ఒంటబట్టించుకుంటాడు. జోరుగా హుషారుగా సాగే వరుణ్ వ్యాపార ప్రయాణాన్ని ఆస్వాదించండి - చిత్తు కాగితం మీద వ్యాపార ప్రణాళికను రచించడం దగ్గర్నుంచి, నిధుల సమీకరణలో ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమిస్తూ, తనని సాదాసీదా సేల్స్ మేన్ గా ఎగతాళి చెయ్యబడే వరకు ఈ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. అడ్డంకులన్నింటినీ ఎదుర్కొని మిలియన్ డాలర్ కంపెనీ వ్యవస్థాపించడంలో వరుణ్ విజయం సాధిస్తాడా? లేదా అనూ ఆంటీ ముసిముసిగా నవ్వుకుంటుందా?. తమ అభిరుచిని వృత్తిగా మలచుకోవాలనే వారంతా వరుణ్ విజయగాధను తప్పనిసరిగా చదవాల్సిందే. హాస్యం, వ్యంగ్యంతోబాటు గోరుముద్దలలాంటి వివేకం మనకి చక్కిలిగింతలు పెడతాయి.© 2017,www.logili.com All Rights Reserved.