కుసుమ ధర్మన్న పేరు చాలా కాలంగా వింటున్నా - మాకొద్ది నల్లదొరతనమూ అనే చరణం గుర్తు చేసుకుంటున్నా నిజానికి ఆయన జీవిత సాహిత్యాల గురించి తెలిసింది చాలా తక్కువ. తెలిసిన దాంట్లోనూ గ్రంథస్తమైంది మరీ తక్కువ. వచ్చిన సమాచారంలోనూ సందేహాలు సంవాదాలు మరీ ఎక్కువ. దీనికి ఎవరు కారణం, ఎంతవరకు కారణం, అందులో యాదృచ్చికత ఎంత కుత్సితం ఎంత వంటి ప్రశ్నలు రాకుండా ఉండవు, వాటికి సమాధానాలు ఒక పట్టాన దొరకనూ దొరకవు. ఏది ఏమైనా దళిత సాహిత్య సామాజిక ప్రథమ ప్రయోక్తల్లో ఒకరైన కుసుమ ధర్మన్న జీవితం గురించి సమగ్రమైన సమాచారం లేదన్న కొరత నిజం. ఈ పుస్తకం దాన్ని చాలా విధాలుగా చాలా కోణాలలో భర్తీ చేస్తుందనే విశ్వాసం కూడా నిజం.
కుసుమ ధర్మన్న పేరు చాలా కాలంగా వింటున్నా - మాకొద్ది నల్లదొరతనమూ అనే చరణం గుర్తు చేసుకుంటున్నా నిజానికి ఆయన జీవిత సాహిత్యాల గురించి తెలిసింది చాలా తక్కువ. తెలిసిన దాంట్లోనూ గ్రంథస్తమైంది మరీ తక్కువ. వచ్చిన సమాచారంలోనూ సందేహాలు సంవాదాలు మరీ ఎక్కువ. దీనికి ఎవరు కారణం, ఎంతవరకు కారణం, అందులో యాదృచ్చికత ఎంత కుత్సితం ఎంత వంటి ప్రశ్నలు రాకుండా ఉండవు, వాటికి సమాధానాలు ఒక పట్టాన దొరకనూ దొరకవు. ఏది ఏమైనా దళిత సాహిత్య సామాజిక ప్రథమ ప్రయోక్తల్లో ఒకరైన కుసుమ ధర్మన్న జీవితం గురించి సమగ్రమైన సమాచారం లేదన్న కొరత నిజం. ఈ పుస్తకం దాన్ని చాలా విధాలుగా చాలా కోణాలలో భర్తీ చేస్తుందనే విశ్వాసం కూడా నిజం.© 2017,www.logili.com All Rights Reserved.