పరిచయము
ఎంతటి బహికసుఖభోగాలను అనుభవిస్తున్నప్పటికీ మానవుడు సంతోషంగా, ఆరోగ్యంగా లేడు. బాహ్యాన్ని శుభ్రపరచి, సరిదిద్ది, రకరకాల అలంకరణలతో సౌందర్యభరితం చేయగల్గుతున్నాడు గానీ అంతరంగంలోవున్న దురుద్దేశాలు, ప్రణాళికల, నిర్వహణల, వ్యూహాల నుండి మాత్రం స్వేచ్ఛ పొందలేకపోతున్నాడు. ఇవన్నీకూడా మోసాలుగా, ఇతరులను పడగొట్టడాలుగా వ్యక్తమవుతున్నాయి. అవన్నీ తనలోనివి గూడానని తెలుసుకోలేక యివన్నీ యితరులలోనివే అనుకుంటున్నాడు. శ్రద్ధ చూపటం, బాధ్యత వహించడం స్వార్ధపూరితమై ఫిర్యాదుల మబ్బులతో కప్పబడుతున్నాయి. మాటలతో హింసించడం, భౌతికంగా హింసించడం యుద్ధాలుగా పరిణమించి హింసా ప్రవృత్తిని ప్రకోపింప, జేస్తున్నాయి. కుటుంబ జీవితంలో పరస్పర ప్రేమ, వాత్సల్యాలు, బంధాలు అడుగంటిపోయి భద్రతను పోగొడుతున్నాయి. వివాహం జీవనపర్యంతం తోడుగా వుండే భాగస్వామినీయడం లేదు. పండితులు కూడా తమ తమ స్వార్థాలతో విశ్వసనీయంగా లేరు. అధికారం, హోదా వున్న మనుషులు కూడా అవి కల్పించిన తోటివారి సంక్షేమం పట్ల ఆసక్తి చూపడం లేదు.
ధనవంతుడు తాను మరింత సంపన్నుడిని కావాలని కోరుకుంటున్నాడు. మనం ఆయుష్షు పెంచుకోవాలని అనుకుంటూ తిండి మాత్రం మరింత తింటున్నాము. స్నేహాన్ని కాంక్షిస్తూ ఒకరినొకరం మోసగించుకుంటున్నాము. మనల్ని మనం గాయపరచుకోవడంగానీ, ఇతరులను గాయపరచడంగానీ మానడం లేదుగానీ, సంతోషంగా మనశ్శాంతిగా వుండాలనిమాత్రం కోరుకుంటున్నాము. సంతోషంగా వుండాలన్న కోరికను వదలలేకపోతున్నాము. మనం దురాశతో ఫలితాలునాశిస్తూ ఘర్షణపడుతూ జీవిస్తున్నాము. మనం యెంతకాలం బ్రతికామన్నదికాదు, ఎలా బ్రతికామన్నది ముఖ్యం. ప్రతిసారి మనం మానసిక....................
పరిచయము ఎంతటి బహికసుఖభోగాలను అనుభవిస్తున్నప్పటికీ మానవుడు సంతోషంగా, ఆరోగ్యంగా లేడు. బాహ్యాన్ని శుభ్రపరచి, సరిదిద్ది, రకరకాల అలంకరణలతో సౌందర్యభరితం చేయగల్గుతున్నాడు గానీ అంతరంగంలోవున్న దురుద్దేశాలు, ప్రణాళికల, నిర్వహణల, వ్యూహాల నుండి మాత్రం స్వేచ్ఛ పొందలేకపోతున్నాడు. ఇవన్నీకూడా మోసాలుగా, ఇతరులను పడగొట్టడాలుగా వ్యక్తమవుతున్నాయి. అవన్నీ తనలోనివి గూడానని తెలుసుకోలేక యివన్నీ యితరులలోనివే అనుకుంటున్నాడు. శ్రద్ధ చూపటం, బాధ్యత వహించడం స్వార్ధపూరితమై ఫిర్యాదుల మబ్బులతో కప్పబడుతున్నాయి. మాటలతో హింసించడం, భౌతికంగా హింసించడం యుద్ధాలుగా పరిణమించి హింసా ప్రవృత్తిని ప్రకోపింప, జేస్తున్నాయి. కుటుంబ జీవితంలో పరస్పర ప్రేమ, వాత్సల్యాలు, బంధాలు అడుగంటిపోయి భద్రతను పోగొడుతున్నాయి. వివాహం జీవనపర్యంతం తోడుగా వుండే భాగస్వామినీయడం లేదు. పండితులు కూడా తమ తమ స్వార్థాలతో విశ్వసనీయంగా లేరు. అధికారం, హోదా వున్న మనుషులు కూడా అవి కల్పించిన తోటివారి సంక్షేమం పట్ల ఆసక్తి చూపడం లేదు. ధనవంతుడు తాను మరింత సంపన్నుడిని కావాలని కోరుకుంటున్నాడు. మనం ఆయుష్షు పెంచుకోవాలని అనుకుంటూ తిండి మాత్రం మరింత తింటున్నాము. స్నేహాన్ని కాంక్షిస్తూ ఒకరినొకరం మోసగించుకుంటున్నాము. మనల్ని మనం గాయపరచుకోవడంగానీ, ఇతరులను గాయపరచడంగానీ మానడం లేదుగానీ, సంతోషంగా మనశ్శాంతిగా వుండాలనిమాత్రం కోరుకుంటున్నాము. సంతోషంగా వుండాలన్న కోరికను వదలలేకపోతున్నాము. మనం దురాశతో ఫలితాలునాశిస్తూ ఘర్షణపడుతూ జీవిస్తున్నాము. మనం యెంతకాలం బ్రతికామన్నదికాదు, ఎలా బ్రతికామన్నది ముఖ్యం. ప్రతిసారి మనం మానసిక....................© 2017,www.logili.com All Rights Reserved.