పరబ్రహ్మ స్వరూపమైన ఆత్మకి జననమరణ రూపము ఉండకూడదు అనుకుంటే జ్ఞానవైరాగ్యాల్ని ప్రసాదించే భక్తిభావాన్ని కలిగి ఉండాలి.
భగవంతుడి కథల్ని తరచుగా వినడం వల్ల భక్తిభావం కలుగుతుంది. భక్తి, శ్రద్ధ, వాటి యందు గౌరవం ఉండి ప్రతి రోజూ భగవంతుడి గురించిన కథలు వినేవాళ్లు జ్ఞానవైరాగ్యాల్ని అతి తొందరలో పొందుతారు.
భక్తిభావం కలిగిన భక్తులు భగవంతుడిని కీర్తించడంలోను, వినడంలోను మునిగి ఉంటారు.
సాధువులు అందరూ కూర్చుని మాట్లాడుకునేప్పుడు ఎప్పుడు భగవంతుడిని గురించిన మాటలే మాట్లాడుకుంటారు.
భగవంతుడిని గురించిన కథలు వినేవాళ్లకి ఆకలి, దాహము ఉండదు. భయం, మోహం, శోకం వాళ్ల దరిదాపులకి కూడా రావు.
వేద వాజ్ఞ్మయం అపారమైంది, విస్తృతమైంది. అదే విధంగా కర్మకాండ కూడా విస్తారమైంది. వేదమంత్రాల్లో చెప్పినట్టు ప్రజలు వజ్రహస్తుడు ఇంద్రుడని, పాశహస్తుడు వరుణుడని అనుకుంటూ దేవతా రూపాల్లో ఉన్న వాళ్లని పూజిస్తారు.
- భమిడిపాటి బాలాత్రిపురసుందరి