మైనంతో చేసిన కొవ్వోత్తిలో చీకటిని పారద్రోలగలిగే వెలుగు వున్నట్లు దానిని వెలిగించే దాకా తెలియదు. కేవలం ఒక అడుగు పొడవున్న వెదురు కర్రతో చేసిన వేణువులో తన్మయత్వం కలిగించే రాగాలు వున్నాయని వాయిస్తే గానీ తెలియదు. అలాగే మనలో గుప్తంగా వుండే మనోశక్తిని వాడుకోవటం మొదలుపెడితేగానీ శక్తి సంపద గురించి మనకు తెలియదు. అంతర్గంగా వున్న శక్తి సామర్థ్యాలను మేల్కొలపటానికి, సూచనల ద్వారా మనసును కావలసిన దిశలోకి మార్చుకోవడానికి 'సెల్ఫ్ హిప్నాటిజం' ఎంతో ఉపయోగపడుతుంది. రత్నాలు వున్న భూమిలో కూడా పైపైన చూస్తే రాళ్ళు, మట్టి మాత్రమే కనిపిస్తాయి. బాగా లోతుగా పోతే గానీ రత్నాలు వున్నట్లు తెలియదు. అలాగే మనలోని అంతర్గతమైన శక్తిని వెలికి తీయడానికి ప్రయత్నిస్తే కానీ, మనకు వున్న 'శక్తి'ని గురించి తెలుసుకోలేము.
సబ్ కాన్షస్ మైండ్ ఒక 'పవర్ హౌజ్' లాంటిది. ఈ పవర్ హౌజ్ లాంటి శక్తిని మీరు సంపాదించుకోవడానికి కష్టపడనవసరం లేదు. మీలో ఆ శక్తి సహజంగానే వుంది. ఆ శక్తిని వెలికి తీయడానికి 'సెల్ఫ్ హిప్నాటిజం' సాధన చేస్తూ, ఆలోచనా ప్రక్రియలో సానుకూల దృక్పథాన్ని జోడిస్తే మీ సబ్ కాన్షస్ మైండ్ అద్భుతాలను సృష్టిస్తుంది. ప్రయత్నించి ఆ శక్తిని తెలుసుకోండి.
- బి వి సత్యనాగేష్
మైనంతో చేసిన కొవ్వోత్తిలో చీకటిని పారద్రోలగలిగే వెలుగు వున్నట్లు దానిని వెలిగించే దాకా తెలియదు. కేవలం ఒక అడుగు పొడవున్న వెదురు కర్రతో చేసిన వేణువులో తన్మయత్వం కలిగించే రాగాలు వున్నాయని వాయిస్తే గానీ తెలియదు. అలాగే మనలో గుప్తంగా వుండే మనోశక్తిని వాడుకోవటం మొదలుపెడితేగానీ శక్తి సంపద గురించి మనకు తెలియదు. అంతర్గంగా వున్న శక్తి సామర్థ్యాలను మేల్కొలపటానికి, సూచనల ద్వారా మనసును కావలసిన దిశలోకి మార్చుకోవడానికి 'సెల్ఫ్ హిప్నాటిజం' ఎంతో ఉపయోగపడుతుంది. రత్నాలు వున్న భూమిలో కూడా పైపైన చూస్తే రాళ్ళు, మట్టి మాత్రమే కనిపిస్తాయి. బాగా లోతుగా పోతే గానీ రత్నాలు వున్నట్లు తెలియదు. అలాగే మనలోని అంతర్గతమైన శక్తిని వెలికి తీయడానికి ప్రయత్నిస్తే కానీ, మనకు వున్న 'శక్తి'ని గురించి తెలుసుకోలేము. సబ్ కాన్షస్ మైండ్ ఒక 'పవర్ హౌజ్' లాంటిది. ఈ పవర్ హౌజ్ లాంటి శక్తిని మీరు సంపాదించుకోవడానికి కష్టపడనవసరం లేదు. మీలో ఆ శక్తి సహజంగానే వుంది. ఆ శక్తిని వెలికి తీయడానికి 'సెల్ఫ్ హిప్నాటిజం' సాధన చేస్తూ, ఆలోచనా ప్రక్రియలో సానుకూల దృక్పథాన్ని జోడిస్తే మీ సబ్ కాన్షస్ మైండ్ అద్భుతాలను సృష్టిస్తుంది. ప్రయత్నించి ఆ శక్తిని తెలుసుకోండి. - బి వి సత్యనాగేష్© 2017,www.logili.com All Rights Reserved.