మహాత్మాగాంధీని ఆదర్శంగా ఉంచుకొని సత్యనిష్ఠ, ధర్మదీక్ష కలిగి ఉండడమేమిటి? సేవా త్యాగాలు జీవితానికి మూల స్తంభాలుగా చేసుకోవడమేమిటి? ప్రస్తుత రాజకీయ వ్యవస్థ గమనిస్తున్న వారికి ఇవన్నీ ఆశ్చర్యమనిపించవచ్చు. ఇలాంటి వ్యక్తులు కొందరు మనమధ్య ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. వారి అనుభవాలు మనకు మార్గదర్శకం కావాలి. అందుకే భాట్టం గారిని స్వీయ చరిత్ర వ్రాయమని పదేపదే కోరాను.
"స్వేఛ్చాభారతం ఆరు దశాబ్దాల చరిత్రకు దర్పణం. స్వాతంత్ర్య పోరాటాల ఆరాటం నుంచి ప్రారంభమై స్వాతంత్ర్యానంతర ఎన్నికల రాజకీయాలు - ఎత్తులు - జిత్తులు మనకళ్ళముందు రంగుల రాట్నంలా తిప్పారు భాట్టంగారు. ఆధునిక రాజకీయాలు తేరవెనుక బాగోతాలు అనేకం మనకు తెలుస్తాయి. పార్లమెంటరీ సంప్రదాయాలు ఏ విధంగా ఆనాడు పరిడవిల్లాయో, ఈనాడు అవి ఎలా దిగజారాయో ఈ గ్రంథం ద్వారా మనకు తేటతెల్లమవుతుంది."
- మండలి బుద్ధ ప్రసాద్
మహాత్మాగాంధీని ఆదర్శంగా ఉంచుకొని సత్యనిష్ఠ, ధర్మదీక్ష కలిగి ఉండడమేమిటి? సేవా త్యాగాలు జీవితానికి మూల స్తంభాలుగా చేసుకోవడమేమిటి? ప్రస్తుత రాజకీయ వ్యవస్థ గమనిస్తున్న వారికి ఇవన్నీ ఆశ్చర్యమనిపించవచ్చు. ఇలాంటి వ్యక్తులు కొందరు మనమధ్య ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. వారి అనుభవాలు మనకు మార్గదర్శకం కావాలి. అందుకే భాట్టం గారిని స్వీయ చరిత్ర వ్రాయమని పదేపదే కోరాను. "స్వేఛ్చాభారతం ఆరు దశాబ్దాల చరిత్రకు దర్పణం. స్వాతంత్ర్య పోరాటాల ఆరాటం నుంచి ప్రారంభమై స్వాతంత్ర్యానంతర ఎన్నికల రాజకీయాలు - ఎత్తులు - జిత్తులు మనకళ్ళముందు రంగుల రాట్నంలా తిప్పారు భాట్టంగారు. ఆధునిక రాజకీయాలు తేరవెనుక బాగోతాలు అనేకం మనకు తెలుస్తాయి. పార్లమెంటరీ సంప్రదాయాలు ఏ విధంగా ఆనాడు పరిడవిల్లాయో, ఈనాడు అవి ఎలా దిగజారాయో ఈ గ్రంథం ద్వారా మనకు తేటతెల్లమవుతుంది." - మండలి బుద్ధ ప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.