ఋగ్వేదమును భారతదేశము నాలుగు సహస్రాబ్దుల కంటే పూర్వము నుండి, పాశ్చాత్యదేశాలు రెండు శతాబ్దాలుగా అధ్యయనం చేస్తున్నప్పటికీ, ఇటీవల కాలము వరకు ఆ గ్రంథ నిర్మాణములో రహస్యాలు ఇమిడి ఉన్నాయని ఎవ్వరూ భావించలేదు. ఋగ్వేదమందలి స్తుతులలోని అనేక భాగములు గూడార్థయుతమైనవిగా గుర్తించబడ్డాయి. అవి, గ్రంథమునందలి అనేక నిగూఢ విషయములు చైతన్యము, సత్యముల ఆశ్చర్యకరమైన స్వభావమును తెలియజేయుట కొరకు ఉద్దేశించబడినవి. ప్రగాఢమైన భావగర్భితమైన దానిని ఋగ్వేదము కావ్యరూపములో వెలువరించిందనేది సర్వత్రా ఆమోదించబడినది. దాని యందలి మౌలికమైన శాస్త్రవిజ్ఞాన ప్రాతిపదికను ఎవ్వరూ గుర్తించలేదు.
వేదాలలోని సాంకేతిక రహస్యాల గురించి సంప్రదాయేతరరీతులలో అన్వేషించి, అనన్య సామాన్యమైన శిఖరాలను ఆవిష్కరించిన వారిలో డా సుభాష్ కాక్ అద్వితీయుడు. కాశ్మీర పుణ్యభూమిలో ఉద్భవించిన అద్భుత మాణిక్యాలలో ఇతడొకడు. ఇతను తన తండ్రి దగ్గర నుంచీ స్వీకరించిన సూత్రాలలో స్వీయమేధను మేళవించి ఆవిష్కరించిన అపూర్వ వేదపరిశీలన రత్నాలలో ఈ 'ఋగ్వేద సాంకేతికత - ఖగోళ రహస్యాలు' అనే గ్రంథం ఆశ్చర్యకరమైన ఆణిముత్యం!
ఋగ్వేదమును భారతదేశము నాలుగు సహస్రాబ్దుల కంటే పూర్వము నుండి, పాశ్చాత్యదేశాలు రెండు శతాబ్దాలుగా అధ్యయనం చేస్తున్నప్పటికీ, ఇటీవల కాలము వరకు ఆ గ్రంథ నిర్మాణములో రహస్యాలు ఇమిడి ఉన్నాయని ఎవ్వరూ భావించలేదు. ఋగ్వేదమందలి స్తుతులలోని అనేక భాగములు గూడార్థయుతమైనవిగా గుర్తించబడ్డాయి. అవి, గ్రంథమునందలి అనేక నిగూఢ విషయములు చైతన్యము, సత్యముల ఆశ్చర్యకరమైన స్వభావమును తెలియజేయుట కొరకు ఉద్దేశించబడినవి. ప్రగాఢమైన భావగర్భితమైన దానిని ఋగ్వేదము కావ్యరూపములో వెలువరించిందనేది సర్వత్రా ఆమోదించబడినది. దాని యందలి మౌలికమైన శాస్త్రవిజ్ఞాన ప్రాతిపదికను ఎవ్వరూ గుర్తించలేదు. వేదాలలోని సాంకేతిక రహస్యాల గురించి సంప్రదాయేతరరీతులలో అన్వేషించి, అనన్య సామాన్యమైన శిఖరాలను ఆవిష్కరించిన వారిలో డా సుభాష్ కాక్ అద్వితీయుడు. కాశ్మీర పుణ్యభూమిలో ఉద్భవించిన అద్భుత మాణిక్యాలలో ఇతడొకడు. ఇతను తన తండ్రి దగ్గర నుంచీ స్వీకరించిన సూత్రాలలో స్వీయమేధను మేళవించి ఆవిష్కరించిన అపూర్వ వేదపరిశీలన రత్నాలలో ఈ 'ఋగ్వేద సాంకేతికత - ఖగోళ రహస్యాలు' అనే గ్రంథం ఆశ్చర్యకరమైన ఆణిముత్యం!© 2017,www.logili.com All Rights Reserved.