నక్షత్రాలను వెలిగించగలిగే బంగారు భవిష్యత్తు ఉన్న ఒక దళితుడు నిస్సహాయంగా ఈ దేశం నడిబొడ్డు మీద ఉరివేసుకున్నాడు కదా, ఆ ఉరి ఈ దేశపు భవిష్యత్తును ఏం చేయబోతుందో ఆలోచించుకోండి. దళితులకు ఒక దేశం కోరుకొని ఉండాల్సింది అని అంబేద్కర్ చివరి దినాలలో పశ్చాత్తాపపడ్డాడని తప్పకుండా గుర్తు తెచ్చుకోండి. మాటే కదా అని తేలికగా తీసుకోగలమా! విప్లవాలు, మాటలు మాటలూ పెనవేసుకొని, చేతలయే కదా సంభవిస్తాయి. సహన ధరిత్రి చూసి చూసి ఇక చూడలేక కోపించడం లేదా... అట్టా వస్తాయి భూకంపాలు, ఆ భూకంపాలకు మా ప్రాతినిధ్య ఉడతా భక్తీ సహాయం ఇలా చేస్తుంది.
చరిత్రని సరిగా లిఖించడంలో చెయ్యి చేసుకుంటుంది. అందులో భాగంగా ఇదిగో ఇలా ఈ సంవత్సరం అత్యుత్తమ కథల్ని మీ ముందుకు తీసుకు వస్తుంది. ఇవి కుల కథలు కావు, మత కథలూ కావు, ఎత్తిపోతల కథలూ కావు, అక్షరాలా - ఉత్తమ సమాజాన్ని స్వప్నిస్తున్న అత్యుత్తమ కథలు.
నక్షత్రాలను వెలిగించగలిగే బంగారు భవిష్యత్తు ఉన్న ఒక దళితుడు నిస్సహాయంగా ఈ దేశం నడిబొడ్డు మీద ఉరివేసుకున్నాడు కదా, ఆ ఉరి ఈ దేశపు భవిష్యత్తును ఏం చేయబోతుందో ఆలోచించుకోండి. దళితులకు ఒక దేశం కోరుకొని ఉండాల్సింది అని అంబేద్కర్ చివరి దినాలలో పశ్చాత్తాపపడ్డాడని తప్పకుండా గుర్తు తెచ్చుకోండి. మాటే కదా అని తేలికగా తీసుకోగలమా! విప్లవాలు, మాటలు మాటలూ పెనవేసుకొని, చేతలయే కదా సంభవిస్తాయి. సహన ధరిత్రి చూసి చూసి ఇక చూడలేక కోపించడం లేదా... అట్టా వస్తాయి భూకంపాలు, ఆ భూకంపాలకు మా ప్రాతినిధ్య ఉడతా భక్తీ సహాయం ఇలా చేస్తుంది. చరిత్రని సరిగా లిఖించడంలో చెయ్యి చేసుకుంటుంది. అందులో భాగంగా ఇదిగో ఇలా ఈ సంవత్సరం అత్యుత్తమ కథల్ని మీ ముందుకు తీసుకు వస్తుంది. ఇవి కుల కథలు కావు, మత కథలూ కావు, ఎత్తిపోతల కథలూ కావు, అక్షరాలా - ఉత్తమ సమాజాన్ని స్వప్నిస్తున్న అత్యుత్తమ కథలు.© 2017,www.logili.com All Rights Reserved.