కల్పనా రెంటాల పరిచయం అక్కరలేని రచయిత్రి. ప్రవాస స్త్రీల జీవితాల గురించి సునిశిత పరిశీలనతో రాసిన కథలివి. స్త్రీవాద సాహిత్యంలో ఈ కథలు ముఖ్య భూమికను నిర్వహిస్తాయి. తొలి కవిత్వ సంపుటి "నేను కనిపించే పదం" 'అజంతా పురస్కారం' అందుకుంది. 2010లో వెలువడిన “తన్హాయీ” నవల విశేషంగా చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ స్త్రీవాద కవిత్వాన్ని “ఆమె పాట”గా అనువదించారు. కవిత్వం, నవల, సాహిత్య విమర్శ, అనువాద రంగాలలో తనదైన ముద్ర బలంగా వేసుకున్న ఆమె మొదటి కథా సంపుటి అయిదో గోడను "చాయా? సగర్వంగా సమర్పిస్తోంది.
విశేషాదరణ పొందిన కల్పన కథల ఇతివృత్తాలలో వైవిధ్యం, సంఘర్షణ ఉంది. వివాదాస్పదమైన అంశాలు, స్త్రీల సమస్యలు, అమెరికా జీవనసరళి - ఏ అంశం తీసుకున్నా అనేక కోణాలు పరిశీలించి ఆవిష్కరించినట్టు కనిపిస్తుంది. తెలుగు భాష మీద మంచిపట్టు గల కల్పన తెలుగు సంస్కృతికి సంబంధించిన ఇతివృత్తాలతో మరిన్ని కథలు రాయగలరని ఆశిస్తూ, శుభాకాంక్షలతో.
-నిడదవోలు మాలతి ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు
సాంస్కృతిక భావజాల సంబంధమైన అయిదో గోడను బద్దలు కొట్టటం కష్టం. ఎందుకంటే అది అనేక వేల సంవత్సరాల కాలం మీద నిర్మించబడుతూ, ప్రచారం చేయబడుతూ ఎప్పటికప్పుడు రకరకాల పద్ధతులలో సామాజిక సమ్మతిని కూడగట్టుకొని ఘనీభవించిన పర్వతాన్ని బద్దలుకొట్టే ప్రయత్నంలో భాగంగా వచ్చినవే కల్పన కథలు. వాటికి ప్రతినిధి అయిదో గోడ. ఇజాలకు, నిజాలకు మధ్య వైరుధ్యాలను గుర్తించి చర్చించటానికి వ్రాసిన కథలు ఇవి.
- కాత్యాయనీ విద్మహే
ప్రముఖ స్త్రీవాద సాహిత్య విమర్శకురాలు
కల్పనా రెంటాల పరిచయం అక్కరలేని రచయిత్రి. ప్రవాస స్త్రీల జీవితాల గురించి సునిశిత పరిశీలనతో రాసిన కథలివి. స్త్రీవాద సాహిత్యంలో ఈ కథలు ముఖ్య భూమికను నిర్వహిస్తాయి. తొలి కవిత్వ సంపుటి "నేను కనిపించే పదం" 'అజంతా పురస్కారం' అందుకుంది. 2010లో వెలువడిన “తన్హాయీ” నవల విశేషంగా చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ స్త్రీవాద కవిత్వాన్ని “ఆమె పాట”గా అనువదించారు. కవిత్వం, నవల, సాహిత్య విమర్శ, అనువాద రంగాలలో తనదైన ముద్ర బలంగా వేసుకున్న ఆమె మొదటి కథా సంపుటి అయిదో గోడను "చాయా? సగర్వంగా సమర్పిస్తోంది. విశేషాదరణ పొందిన కల్పన కథల ఇతివృత్తాలలో వైవిధ్యం, సంఘర్షణ ఉంది. వివాదాస్పదమైన అంశాలు, స్త్రీల సమస్యలు, అమెరికా జీవనసరళి - ఏ అంశం తీసుకున్నా అనేక కోణాలు పరిశీలించి ఆవిష్కరించినట్టు కనిపిస్తుంది. తెలుగు భాష మీద మంచిపట్టు గల కల్పన తెలుగు సంస్కృతికి సంబంధించిన ఇతివృత్తాలతో మరిన్ని కథలు రాయగలరని ఆశిస్తూ, శుభాకాంక్షలతో. -నిడదవోలు మాలతి ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు సాంస్కృతిక భావజాల సంబంధమైన అయిదో గోడను బద్దలు కొట్టటం కష్టం. ఎందుకంటే అది అనేక వేల సంవత్సరాల కాలం మీద నిర్మించబడుతూ, ప్రచారం చేయబడుతూ ఎప్పటికప్పుడు రకరకాల పద్ధతులలో సామాజిక సమ్మతిని కూడగట్టుకొని ఘనీభవించిన పర్వతాన్ని బద్దలుకొట్టే ప్రయత్నంలో భాగంగా వచ్చినవే కల్పన కథలు. వాటికి ప్రతినిధి అయిదో గోడ. ఇజాలకు, నిజాలకు మధ్య వైరుధ్యాలను గుర్తించి చర్చించటానికి వ్రాసిన కథలు ఇవి. - కాత్యాయనీ విద్మహే ప్రముఖ స్త్రీవాద సాహిత్య విమర్శకురాలు© 2017,www.logili.com All Rights Reserved.