దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి కథలు, నవలలు రాస్తున్నాను. ఈ రచనలకు ప్రేరణ, ఉత్తేజం ఎక్కడ నుంచి వచ్చిందని ఆలోచిస్తూ ఉంటే కొన్ని విషయాలు మనస్సులో మెదిలాయి. పాఠకులతో పంచుకోవాలనిపించింది, అందుకే ఈ పుస్తకం.
మా తాతగారి గురించి కథలు, కథలుగా చెబుతూ ఉండేవారు. ఆరడుగుల మనిషి నడుస్తుంటే భూమి ధడ ధడలాడేదట. తిండి పుష్టి ఉన్న మనిషి, ఆయన ఉంచుకున్న మనిషి ఆరుమైళ్ళ దూరంలో ఉన్న మరో గ్రామంలోఉంటే అక్కడకు రాత్రిపూట నడుచుకుంటూ వెళ్లి తెల్లవారు జామున పాత పొన్నూరు తిరిగి వోచ్చేవాడట. మా నాన్న గారు వెంకయ్య చౌదరి కొన్ని సంవత్సరాలు పొన్నూరు మునసబుగా పనిచేశారు. మెరిసిపోయే రంగులో ఎంతో అందంగా ఉండేవారు. విలాసవంతమైన జీవితాన్ని గడిపారు.........ఇందులో
దిష్టి బొమ్మ
నీడనిచ్చే చెట్టు
రాత
నకిలీ మనిషి
దండోరా
అమ్మ ఒడిలోకి
అడగుల వేగం
చివరి మజిలి
విమానం కొనిపెట్టు నాన్న
ఇంకా ఎన్నో కథలు....... రచయిత చిన్ననాటి జ్ఞాపకాలను అందమైన కథల రూపంలో మనకు అందించారు.
-అలపర్తి రామకృష్ణ.
దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి కథలు, నవలలు రాస్తున్నాను. ఈ రచనలకు ప్రేరణ, ఉత్తేజం ఎక్కడ నుంచి వచ్చిందని ఆలోచిస్తూ ఉంటే కొన్ని విషయాలు మనస్సులో మెదిలాయి. పాఠకులతో పంచుకోవాలనిపించింది, అందుకే ఈ పుస్తకం. మా తాతగారి గురించి కథలు, కథలుగా చెబుతూ ఉండేవారు. ఆరడుగుల మనిషి నడుస్తుంటే భూమి ధడ ధడలాడేదట. తిండి పుష్టి ఉన్న మనిషి, ఆయన ఉంచుకున్న మనిషి ఆరుమైళ్ళ దూరంలో ఉన్న మరో గ్రామంలోఉంటే అక్కడకు రాత్రిపూట నడుచుకుంటూ వెళ్లి తెల్లవారు జామున పాత పొన్నూరు తిరిగి వోచ్చేవాడట. మా నాన్న గారు వెంకయ్య చౌదరి కొన్ని సంవత్సరాలు పొన్నూరు మునసబుగా పనిచేశారు. మెరిసిపోయే రంగులో ఎంతో అందంగా ఉండేవారు. విలాసవంతమైన జీవితాన్ని గడిపారు.........ఇందులో దిష్టి బొమ్మ నీడనిచ్చే చెట్టు రాత నకిలీ మనిషి దండోరా అమ్మ ఒడిలోకి అడగుల వేగం చివరి మజిలి విమానం కొనిపెట్టు నాన్న ఇంకా ఎన్నో కథలు....... రచయిత చిన్ననాటి జ్ఞాపకాలను అందమైన కథల రూపంలో మనకు అందించారు. -అలపర్తి రామకృష్ణ.
© 2017,www.logili.com All Rights Reserved.