తెలుగులో తొలి చైతన్య స్రవంతి నవలా రచయితగా పేరొందిన అంపశయ్య నవీన్ మనస్తత్వ విశ్లేషణతో రచనలు చేయటంలో సిద్ధహస్తులు. కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత. నవీన్ కథలు కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలలో వస్తున్న మార్పులను తెలియజేస్తాయి. మనుషులలో పెరిగిపోతున్న అవకాశవాదం, స్వార్థచింతన, వ్యాపార ధోరణిని వివరిస్తాయి. నవీన్ తన అనుభవ పరిధిలోకి వచ్చిన సమస్త విషయాలను, చూసిన సంఘటనలను సన్నివేశాలుగా పరిచితులైన పాత్రలుగా మలచి కథలను రూపొందించారు. కల్పన తక్కువగా ఉంది వాస్తవిక ధోరణిలో నవీన్ కథలు కొనసాగుతాయి.
క్షణక్షణం పరిణామం చెందే మనసులోకి ప్రతిస్పందనలను చైతన్య స్రవంతి శిల్పంతో వ్యక్తం చేసి తనదైన ప్రత్యేకతను ఈ కథలలో నవీన్ సాధించారు. నవీన్ కథలు వస్తువులోనే గాక, శిల్పంలోనూ వైవిధ్యాన్ని సంతరించుకున్నాయి. కథలను ఆసక్తికరంగా తీర్చిదిద్దటంలో నవీన్ కు నవీనే సాటి. 'నవీన్ కథలను చదవటం మరచిపోలేని అనుభవం' అన్న ప్రసిద్ధ మధురాంతకం రాజారాం మాటలతో ఈ కథలను చదివిన పాఠకుడు తప్పక ఏకీభవిస్తాడు.
తెలుగులో తొలి చైతన్య స్రవంతి నవలా రచయితగా పేరొందిన అంపశయ్య నవీన్ మనస్తత్వ విశ్లేషణతో రచనలు చేయటంలో సిద్ధహస్తులు. కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత. నవీన్ కథలు కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలలో వస్తున్న మార్పులను తెలియజేస్తాయి. మనుషులలో పెరిగిపోతున్న అవకాశవాదం, స్వార్థచింతన, వ్యాపార ధోరణిని వివరిస్తాయి. నవీన్ తన అనుభవ పరిధిలోకి వచ్చిన సమస్త విషయాలను, చూసిన సంఘటనలను సన్నివేశాలుగా పరిచితులైన పాత్రలుగా మలచి కథలను రూపొందించారు. కల్పన తక్కువగా ఉంది వాస్తవిక ధోరణిలో నవీన్ కథలు కొనసాగుతాయి. క్షణక్షణం పరిణామం చెందే మనసులోకి ప్రతిస్పందనలను చైతన్య స్రవంతి శిల్పంతో వ్యక్తం చేసి తనదైన ప్రత్యేకతను ఈ కథలలో నవీన్ సాధించారు. నవీన్ కథలు వస్తువులోనే గాక, శిల్పంలోనూ వైవిధ్యాన్ని సంతరించుకున్నాయి. కథలను ఆసక్తికరంగా తీర్చిదిద్దటంలో నవీన్ కు నవీనే సాటి. 'నవీన్ కథలను చదవటం మరచిపోలేని అనుభవం' అన్న ప్రసిద్ధ మధురాంతకం రాజారాం మాటలతో ఈ కథలను చదివిన పాఠకుడు తప్పక ఏకీభవిస్తాడు.© 2017,www.logili.com All Rights Reserved.