అనువాదం కత్తి మీద సాము. కథల అనువాదమైతే మూల కథ భావం దెబ్బతినకుండా అక్షరాలతో విన్యాసం చేయాల్సిందే. రచయిత మస్తిష్కంలోకి దూరి అయన / ఆమె భావనను అందిపుచ్చుకుని అనువాద రచనను సిసలైన ఒరిజనల్ కథగా తీర్చిదిద్దడం ఒక సవాలే. మూల భాషలోని స్థాయి, ఉత్కృష్టతకు దీటుగా లక్ష్య భాషలోకి రచనను పాత్రోచితంగా భావానువాదం చేయడం కష్టసాధ్యమైన విషయం. అచ్చమైన తెలుగు వాతావరణంలో పెరిగిన నేను, ఉర్దూ నేర్చుకుని జీలానీ బానూ వంటి అగ్రశ్రేణి రచయిత్రి కథలను తెలుగులోకి అనువదించే పనిని తలకెత్తుకోవడం ఒక సాహసంగానే భావిస్తున్నాను. ఈ సవాలుకు మానసికంగా సిద్ధమయ్యేందుకు నాకు చాలా సమయమే పట్టింది. 15 ఏళ్ల క్రితం - తొలిసారిగా జీలానీ బానుగారి 'ముజ్రిమ్' కథను తెలుగులోకి తేవడం నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. బానుగారు రాసిన వాటిలో 21 కథలను అనువదించి రెండేళ్ల క్రితం 'గుప్పిట జారే ఇసుక' పేరుతో తీసుకువచ్చిన పుస్తకానికి మంచి స్పందన రావడం నాకు మరింత ఉత్సాహాన్ని కలిగించింది.
- మెహక్ హైదరాబాదీ