సంఘసంస్కరణ ఉద్యమం చివరి దశలో స్వతంత్ర పోరాటం ప్రారంభమైన మొదటి దశలో జన్మించిన వ్యక్తి మా నాన్న. గ్రంథాలయోద్యమానికి పేరు పొందిన వేటపాలెం (ఇప్పటి ప్రకాశం - అప్పటి గుంటూరు జిల్లా) అమ్మ జన్మ స్థలం. ఆయన పుట్టిన ఒక దశాబ్దం తర్వాత జన్మించిన అమ్మ బడిలో చదువుకునే రోజులకి గ్రంథాలయోద్యమం తెలుగు నాట ఉపందుకుంది. అమ్మ సీత, ఆమె చెల్లెలు శేషు ఎనిమిదో తరగతి వరకు వేట పాలెంలోనే చదువుకున్నారు. ఇళ్ళల్లో ఉండే ఆడవాళ్ళు చదువుకోవటానికి వేటపాలెం లైబ్రరీ నుంచి పుస్తకాల్ని ఇళ్ళకు పంపించే పద్దతి ఆ రోజుల్లో ఉండేది.
- కె. లలిత