బషీరున్నీసా బేగం గారి కథలన్నిటా చక్కని వస్తువైవిద్యం కనిపిస్తుంది. పాత్రలన్నీ మనకు పరిచితమైన రక్తమాంసాలు కలిగిన మనుషులుగా దర్శనమిస్తారు. సన్నివేశాలు మనం పాల్గొన్న వాతావరణాన్నే స్ఫురింపజేస్తాయి. చక్కటి సమకాలీనత సామాజికత మానవీయత కలిగిన వస్తు గ్రహణం బేగం గారి ప్రతిభాశక్తి గోరంత సూక్తిని మననాధారలో పెట్టుకుని కొండంత కథనాన్ని ఇవ్వగలిగిన కలం బలం ఆమెది.
- విహారి
బషీరున్నీసా కథలన్నీ సంసారపక్షంగా మధ్య తరగతి వెంపర్లాటలకి అతి సన్నిహితంగా వుంటాయి. జీవితంలోని విషాదాన్ని ఏకాంతాన్ని ఒంటరితనపు దిగుళ్ళని మొహాలని ఆదర్శాలని ఈమె కథలు మోస్తాయి. ప్రతి కథ అతి సహజంగా నిర్మలంగా సున్నితంగా ఉంటుంది. దాదాపు ఈమె కథలన్నీ మనోవైజ్ఞానిక విభాగం కిందకి పరిగణించవచ్చు. జీవితంలోని ఎమోషన్స్ ని రచయిత్రి అతి సులువుగా చాకచక్యంతో పరిష్కార దిశగా చూపిస్తారు.
- శ్రీరామ కవచం సాగర్