ఇల జమిడికె తంత్రిలో..
తెలుగు కథా సాహిత్యంలో బైండ్ల సెంద్రయ్య కథలు విశిష్ఠమైనవి. కల్చరల్ స్టోరీస్ ఇవి. చరిత్ర, సంస్కృతి, ద్రవిడ జాతి నాగరికతల మార్మిక సౌందర్యాల అల్లిక ఈ కథలు. కుల వాస్తవికత, సంస్కృతిలోని మ్యాజికల్ రియలిజం కమ్ముకున్న కళాతత్వ దర్పణం ఈ కథలు. నిలువెత్తు ఆత్మగౌరవానికీ, తిరుగుబాటు తత్వానికి సెంద్రయ్య ఒక సింబల్. మళ్ళీమళ్ళీ పునర్నిర్మాణమయ్యే పురవీరగాథలను 'రీటోల్డ్' చేసిన కథలివి.
ఇప్పటికీ మనం సంస్కృతిని సరిగా అర్థం చేసుకోలేదేమో. రేమాండ్ విలియమ్స్ రాసిన మార్క్సిస్టు థీయరీ ఆఫ్ కల్చర్ రచన యొక్క నిగూఢార్థం మనకింకా బోధపడలేదేమో. సంస్కృతి అనే విశాలమైన భావనలోనే అన్నీ అంతర్లీనమై వుంటాయి. ఒకటి పునాది, మిగతావి ఉపరితలాలనే విభజనను ఆయన ఒప్పుకోలేదు. ఆర్థిక వ్యవస్థను నడిపించే సంస్కృతినీ, దాని పట్టునూ సరిగా పట్టించుకోక పోవడం వల్లనే అనేక ఉద్యమాలు తీరాన్ని చేరుకోలేదన్న విమర్శను తోసిపుచ్చలేము. బహుళ సంస్కృతులు ఉనికిలో వున్న మన సమాజంలో ఏ విషయమూ సరిగా బోధపడలేదన్నది కూడా నిజమే. కులానికో సంస్కృతి వున్న చోట కులం అనేది ఒక నేరవ్యవస్థగా కాకుండా, ఒక సామాజిక నిర్మాణంగా అంగీకరించిన చోట సంస్కృతి అనేదింకా పెద్ద గందరగోళానికి తావిచ్చింది. మల్టీ కల్చర్స్ పరస్పరం కలహించుకుంటూ, ఖండించుకుంటూ సహజీవనం చేసే ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని నిత్యం చూస్తూనే వున్నాం. ఆ క్రమంలోనే అధికారంతో అంటకాగినవి మెయిన్ స్ట్రీమ్ కల్చర్స్ అయ్యాయి. అధికార సంస్థలకు ఎదురు నిలబడిన కల్చర్స్ 'సబ్ కల్చర్స్'గా, 'అకల్చర్స్' గా మార్జినలైజయ్యాయి. బైండ్ల సంస్కృతి సబ్కల్చర్ కాదు. అకల్చర్ అసలే కాదు. అది విక్టిమ్హుడ్ కల్చర్ అంతకన్నా కాదు. అది ఒరిజినల్ కల్చర్. ఆ కల్చరల్ రీప్రొడక్షనే బైండ్ల సెంద్రెయ్య క్యారెక్టర్.
కథను మనం ఫోనోస్ నుంచి లోగోస్కు మార్చేశాక, నారేటివ్ టోన్లోనూ పిక్చరైజేషన్లోనూ ఒక నార్మేటివ్ ధోరణి స్థిరపడ్డది. ఈ............
ఇల జమిడికె తంత్రిలో.. తెలుగు కథా సాహిత్యంలో బైండ్ల సెంద్రయ్య కథలు విశిష్ఠమైనవి. కల్చరల్ స్టోరీస్ ఇవి. చరిత్ర, సంస్కృతి, ద్రవిడ జాతి నాగరికతల మార్మిక సౌందర్యాల అల్లిక ఈ కథలు. కుల వాస్తవికత, సంస్కృతిలోని మ్యాజికల్ రియలిజం కమ్ముకున్న కళాతత్వ దర్పణం ఈ కథలు. నిలువెత్తు ఆత్మగౌరవానికీ, తిరుగుబాటు తత్వానికి సెంద్రయ్య ఒక సింబల్. మళ్ళీమళ్ళీ పునర్నిర్మాణమయ్యే పురవీరగాథలను 'రీటోల్డ్' చేసిన కథలివి. ఇప్పటికీ మనం సంస్కృతిని సరిగా అర్థం చేసుకోలేదేమో. రేమాండ్ విలియమ్స్ రాసిన మార్క్సిస్టు థీయరీ ఆఫ్ కల్చర్ రచన యొక్క నిగూఢార్థం మనకింకా బోధపడలేదేమో. సంస్కృతి అనే విశాలమైన భావనలోనే అన్నీ అంతర్లీనమై వుంటాయి. ఒకటి పునాది, మిగతావి ఉపరితలాలనే విభజనను ఆయన ఒప్పుకోలేదు. ఆర్థిక వ్యవస్థను నడిపించే సంస్కృతినీ, దాని పట్టునూ సరిగా పట్టించుకోక పోవడం వల్లనే అనేక ఉద్యమాలు తీరాన్ని చేరుకోలేదన్న విమర్శను తోసిపుచ్చలేము. బహుళ సంస్కృతులు ఉనికిలో వున్న మన సమాజంలో ఏ విషయమూ సరిగా బోధపడలేదన్నది కూడా నిజమే. కులానికో సంస్కృతి వున్న చోట కులం అనేది ఒక నేరవ్యవస్థగా కాకుండా, ఒక సామాజిక నిర్మాణంగా అంగీకరించిన చోట సంస్కృతి అనేదింకా పెద్ద గందరగోళానికి తావిచ్చింది. మల్టీ కల్చర్స్ పరస్పరం కలహించుకుంటూ, ఖండించుకుంటూ సహజీవనం చేసే ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని నిత్యం చూస్తూనే వున్నాం. ఆ క్రమంలోనే అధికారంతో అంటకాగినవి మెయిన్ స్ట్రీమ్ కల్చర్స్ అయ్యాయి. అధికార సంస్థలకు ఎదురు నిలబడిన కల్చర్స్ 'సబ్ కల్చర్స్'గా, 'అకల్చర్స్' గా మార్జినలైజయ్యాయి. బైండ్ల సంస్కృతి సబ్కల్చర్ కాదు. అకల్చర్ అసలే కాదు. అది విక్టిమ్హుడ్ కల్చర్ అంతకన్నా కాదు. అది ఒరిజినల్ కల్చర్. ఆ కల్చరల్ రీప్రొడక్షనే బైండ్ల సెంద్రెయ్య క్యారెక్టర్. కథను మనం ఫోనోస్ నుంచి లోగోస్కు మార్చేశాక, నారేటివ్ టోన్లోనూ పిక్చరైజేషన్లోనూ ఒక నార్మేటివ్ ధోరణి స్థిరపడ్డది. ఈ............© 2017,www.logili.com All Rights Reserved.