చెట్ల వల్ల మనకెన్నో - రెట్లు మేలు కలుగురా చెట్లుంటే మన పెరడుకు - కోట్లకొలది విలువరా !!
అనే గేయం పాడి వినిపించారు తెలుగు టీచరుగారు. పైగా 'చెట్లే ప్రగతికి మెట్లు' అని పిల్లలందరిచేత అనిపించారు. బడిలో ఖాళీ స్థలంలో మొక్కలు నాటించారు.
ఇంటికి వచ్చాక కూడా, పాప చెవిలో ఆ మాటలే మారుమ్రోగసాగాయి.
అపరిశుభ్రంగా వున్న తమ పెరడు కూడా బాగుచేయాలి. తమ పెరట్లో తనూ ఒక మొక్క నాటాలి అనుకుంది పాప. అనుకున్నది సాధించాలనే పట్టుదలఎక్కువ పాపకు. పెరట్లో నీటి పంపు దగ్గర ఖాళీ చోటుంది. అది చెత్తాచెదారాలతో నిండి వుంది. అక్కడక్కడ పిచ్చి మొక్కలున్నాయి. దాన్ని శుభ్రం చేయాలి.
వెంటనే పెరట్లోకి వెళ్ళింది పాప. అక్కడున్న చెత్తా చెదారం ఏరేసింది. పిచ్చి మొక్కలూ పీకేసింది. చిన్న పలుగు చేతబట్టింది. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు
పాపకు ఆరేళ్ళు. ఒకటో తరగతి చదువుతూ వుంది. ఆ రోజు బళ్ళో - వన మహోత్సవ కార్యక్రమం.
చిన్న చిన్న మొక్కలనూ - కొన్ని పాతి పెట్టరా పెరిగి పెరిగి చివరకవే - పెద్ద చెట్లు అగునురా ! చల్లగాలి విసరి విసరి - జల్లులు కురిపించురా ఆయువు పెంచేటి ప్రాణవాయువు నందించురా ! చెట్ల వల్ల మనకెన్నో - రెట్లు మేలు కలుగురా చెట్లుంటే మన పెరడుకు - కోట్లకొలది విలువరా !!