ఈ రచయిత రాయలసీమ మట్టిని పెకలించుకుని వచ్చినవాడు. పట్టణీకరణ నుండి బయటపడలేని తెలుగు సాహిత్యాన్ని పల్లెదారి పట్టించిన వాడు శూద్ర సంస్కృతిని నిర్మించినవాడు బహుజన రాజకీయాలను బోధించినవాడు మాతృభాష నుండి ఇంటి భాష వరకూ విస్తరించిన వాడు మాండలికంలో భాషకూ యాసకూ మధ్య అభేదం ప్రకటించినవాడు. తెలుగు వాతావరణంలోని మేధావితనాన్ని రచ్చబండపరం చేసినవాడు. రైతుకూలిగా పుట్టినవాడు. కరువుల ఒడిలో బతికి బట్టకట్టినవాడు. జాతీయ ఆర్థిక సూత్రాల మర్మం తెలిసినవాడు. తన పరిసరాలలో ప్రపంచం పోకడలు పసిగట్టేవాడు. గహనమైన గ్లోబల్ విషయాన్ని సైతం పరిసరాల పోట్లంలో చుట్టి అందించేవాడు.
ఒక చిన్న వినికిడి జ్ఞానాన్ని కూడా రక్తమాంసాలకథగా మార్చగలిగిన వాడు ఇతని కథావస్తువులు ఉబికే ఊటలు ఒకటా? రెండా? తన అద్దాన్ని అన్ని వైపులా తిప్పగలిగిన రచయిత ఇతడు! రాసిన ప్రతి కథా తన ‘మనో ధర్మ సంగీతమే’ అయినవాడు!! అటువంటి శాంతినారాయణ రాసినవే ఈ ‘బతుకుబంతి’ కథలు ఇప్పుడు ఈ కథల దొంతిలోకి తొంగిచూద్దాం.