తెలుగు వారికి కథా ప్రక్రియ కొత్తది కాదు. తెలుగు కథ * వయసు వందల సంవత్సరాలు. ఒకనాటి ఈ కథా ప్రక్రియ పాశ్చాత్య సాహిత్యం ప్రభావంతో కథానికగా రూపాంతరం పొందింది. తెలుగు సాహిత్యానికి ఈ కథానిక ప్రక్రియ నూత్న జవజీవాల్ని కల్పించింది. తారీఖులు, దస్తావేజులు ప్రకారం గురజాడ కంటే ముందే కథానిక పుట్టినా; అది బాల్యాన్ని వదిలి బాధ్యతల్ని చేపట్టింది మాత్రం గురజాడతోనే !
తొలితరం తెలుగు రచయితలు కథానిక ప్రక్రియకు నడకలు నేర్పడమేకాదు, ఆ నడకల వేగాన్ని పెంచారు. మలితరం రచయితలు ఆ నడకల వేగాన్ని పరుగులుగా మార్చారు. ఆ పరుగు రాష్ట్ర హద్దులు దాటి, జాతీయ స్థాయిని అధిగమించి, అంతర్జాతీయ వేదికల్ని చేరేవరకూ అలుపెరగని పరుగు. ఇందుకు దోహదం చేసిన అనేకమంది తెలుగు రచయితల్లో ఒకానొక నిలువెత్తు సంతకం శాంతి నారాయణ.
తెలుగు రచయితల్లో శాంతి నారాయణ గారి గురించీ, వారి స్థానాన్ని గురించీ వర్తమాన పాఠక లోకానికి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఇప్పటికే అసంఖ్యాకంగా కథల్నీ, పదుల సంఖ్యలో నవలలూ, నవలికల్నీ రచించారు. తెలుగు సాహిత్య............
గీతల్ని చెడిపేస్తున్న కథలు ఆచార్య మేడిపల్లి రవికుమార్ తెలుగు వారికి కథా ప్రక్రియ కొత్తది కాదు. తెలుగు కథ * వయసు వందల సంవత్సరాలు. ఒకనాటి ఈ కథా ప్రక్రియ పాశ్చాత్య సాహిత్యం ప్రభావంతో కథానికగా రూపాంతరం పొందింది. తెలుగు సాహిత్యానికి ఈ కథానిక ప్రక్రియ నూత్న జవజీవాల్ని కల్పించింది. తారీఖులు, దస్తావేజులు ప్రకారం గురజాడ కంటే ముందే కథానిక పుట్టినా; అది బాల్యాన్ని వదిలి బాధ్యతల్ని చేపట్టింది మాత్రం గురజాడతోనే ! తొలితరం తెలుగు రచయితలు కథానిక ప్రక్రియకు నడకలు నేర్పడమేకాదు, ఆ నడకల వేగాన్ని పెంచారు. మలితరం రచయితలు ఆ నడకల వేగాన్ని పరుగులుగా మార్చారు. ఆ పరుగు రాష్ట్ర హద్దులు దాటి, జాతీయ స్థాయిని అధిగమించి, అంతర్జాతీయ వేదికల్ని చేరేవరకూ అలుపెరగని పరుగు. ఇందుకు దోహదం చేసిన అనేకమంది తెలుగు రచయితల్లో ఒకానొక నిలువెత్తు సంతకం శాంతి నారాయణ. తెలుగు రచయితల్లో శాంతి నారాయణ గారి గురించీ, వారి స్థానాన్ని గురించీ వర్తమాన పాఠక లోకానికి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఇప్పటికే అసంఖ్యాకంగా కథల్నీ, పదుల సంఖ్యలో నవలలూ, నవలికల్నీ రచించారు. తెలుగు సాహిత్య............© 2017,www.logili.com All Rights Reserved.