ప్రమద నల్లగా పొట్టిగా ఉంటుంది. చిన్నికళ్ళు, పెద్ద పెదవులు, తీర్చిదిద్దిన కనుబొమ్మలు, వెడల్పు జడ, చెవులకి దిద్దులు, కాస్త పరిచయం అయ్యాక అలవాటు పడిన వారికి ఆకర్షణీయంగా కనబడుతుంది. పసుపురంగు నల్లటి అడ్డచారలుగల చీరని రెండు మలుపులు చుట్టి కడుతుంది. మోచేతుల కిందకి దిగిన ఎర్రరంగు రెవిక - చీకటి గుహలో వొక్కకాంతి కిరణం ప్రసరించి అంతర్థమవగానే మిగిలిన అస్పష్టత స్ఫురింపజేసే వ్యక్తి ప్రమద. తివాచీమీద కూర్చుని వీణ మోగిస్తూ పడుతుంటుంది.
- బుచ్చిబాబు