దేవరగట్టు
డుర్ర.......గో రాక్...
డుర్ర ..... డుర్రర్ర ..... గో పరాక్
లయబద్ధంగా పెనుకేకలు పదేపదే...వాటిని మారు పలుకుతూ వేలాది గొంతులు. డుర్ర్ర్ర్ గో పరాక్ శబ్దానికి అర్థం, యుద్ధానికి సన్నద్ధం అని. అదొక యుద్ధో న్మాదపు పిలుపు!
చుట్టూ చీకటి నిండిన రెండు కొండల నడమ అరణ్యప్రదేశం, దాన్ని వెలిగిస్తూ వేలాది కాగడాలు. అడవినీరవ నిశ్శబ్దాన్ని ముక్కలు ముక్కలు చేస్తూ తెలుగూ కన్నడం కలగలిసిన అరుపులూ - కేకలూ. వాటి మధ్య లయబద్ధంగా భూమిని తాకుతున్న వేలాది వెదురుకర్రలు చేస్తున్న శబ్దం. అప్పుడప్పుడూ భయం పుట్టిస్తూ, గాల్లోకి అన్ని వేల వెదురు కర్రలు ఒక్కసారిగా లేచి విన్యాసం చేస్తే వినవచ్చే 'సర్రు' మనే శబ్దం................
© 2017,www.logili.com All Rights Reserved.