రాగమతి-వెంకట్ రుసరుసలు
"అవతల వ్రతానికి సమయం దాటి పోతోంది. ఇంత ఎండల్లో ఆ పట్టుచీర
కోసం వెంపర్లాటెందుకు? వంగపండు రంగు కాటన్ చీర ఉండాలి కదా! బాగుంటుంది. అది కట్టుకో..." విసుక్కున్నాడు యాభై ఏళ్ల వెంకట్రావు.
"వ్రతానికి వచ్చే వాళ్లంతా పట్టు చీరెలు కట్టుకొస్తారు. నాకేం తక్కువని నేను కాటన్ చీర కట్టుకోవాలి?...” అంటూనే పట్టుదలగా తనకిష్టమైన పట్టుచీర దొరికేదాకా వెదికి, అప్పుడు గదిలోంచి బయటకొచ్చింది రాగమతి. -
ఆ ముదురు ఎరుపురంగు పట్టుచీర చూస్తూనే వెంకట్రావుకి ఇంకా చిర్రెత్తుకొచ్చింది. 'వంగపండు రంగు కాటన్ చీర ఎంత బాగుంటుంది? ఈ ఆడవాళ్లు మన మాట ఎప్పుడు వింటారు కనుక!' అని విసుక్కుంటూ కారు తీశాడు వెంకట్రావు.
అతను విసుక్కోవటం రాగమతికి నచ్చలేదు. 'నా టేస్ట్ ఇతనికి ఎప్పుడు నచ్చింది కనుక!' రుసరుసలాడుతూ ఆమె కూడా కారెక్కింది.
దారిలో, యథాలాపంగా భర్త మొహం వంక చూసింది. 'ఈ మహానుభావుడు నిన్న, ఇవ్వాళ గడ్డం గీయలేదు. అబ్బా!... తలకి రంగు వేసి పదిరోజులు దాటినట్లుంది. జుట్టు
మొదళ్ళు తెల్లగా కనిపిస్తున్నాయి. నలుగురిలోకి వెళ్తున్నాం కదా! కాస్త ఆ జుట్టుకి రంగు - వేసుకోవచ్చు కదా!.... ఇలా అనుకోని ఊరుకోక, పైకి అనేసింది..
“నా జుట్టు నా ఇష్టం” అంటూ ధుమధుమలాడాడు వెంకట్రావు. అంతే! మాటా మాటా పెరిగింది. చివరికి ఇద్దరూ ఎడ మొహం పెడ మొహంతో వ్రతానికి వెళ్లారు.
సహస్ర చంద్ర దర్శనం చేసిన పెద్దాయన శేషయ్య వీళ్ళని చూసి ఉత్సాహంగా పలకరించారు.
“ఓహో, చిలుకా గోరువంకలు సమయానికి వచ్చేశారే!” అన్నారు శేషయ్య వాళ్ళిద్దర్నీ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ.
ఆ ఇద్దరూ మొహం మీద కొంచెం నవ్వు పులుముకుని, “నమస్కారం" అన్నారు.
సహజంగా పుట్టుకొచ్చిన నవ్వుకి, అసహజంగా పులుముకున్న నవ్వుకి తేడా బాగా తెలిసిన వయస్సు, అనుభవం శేషయ్యగారిది..............
రాగమతి-వెంకట్ రుసరుసలు "అవతల వ్రతానికి సమయం దాటి పోతోంది. ఇంత ఎండల్లో ఆ పట్టుచీర కోసం వెంపర్లాటెందుకు? వంగపండు రంగు కాటన్ చీర ఉండాలి కదా! బాగుంటుంది. అది కట్టుకో..." విసుక్కున్నాడు యాభై ఏళ్ల వెంకట్రావు. "వ్రతానికి వచ్చే వాళ్లంతా పట్టు చీరెలు కట్టుకొస్తారు. నాకేం తక్కువని నేను కాటన్ చీర కట్టుకోవాలి?...” అంటూనే పట్టుదలగా తనకిష్టమైన పట్టుచీర దొరికేదాకా వెదికి, అప్పుడు గదిలోంచి బయటకొచ్చింది రాగమతి. - ఆ ముదురు ఎరుపురంగు పట్టుచీర చూస్తూనే వెంకట్రావుకి ఇంకా చిర్రెత్తుకొచ్చింది. 'వంగపండు రంగు కాటన్ చీర ఎంత బాగుంటుంది? ఈ ఆడవాళ్లు మన మాట ఎప్పుడు వింటారు కనుక!' అని విసుక్కుంటూ కారు తీశాడు వెంకట్రావు. అతను విసుక్కోవటం రాగమతికి నచ్చలేదు. 'నా టేస్ట్ ఇతనికి ఎప్పుడు నచ్చింది కనుక!' రుసరుసలాడుతూ ఆమె కూడా కారెక్కింది. దారిలో, యథాలాపంగా భర్త మొహం వంక చూసింది. 'ఈ మహానుభావుడు నిన్న, ఇవ్వాళ గడ్డం గీయలేదు. అబ్బా!... తలకి రంగు వేసి పదిరోజులు దాటినట్లుంది. జుట్టు మొదళ్ళు తెల్లగా కనిపిస్తున్నాయి. నలుగురిలోకి వెళ్తున్నాం కదా! కాస్త ఆ జుట్టుకి రంగు - వేసుకోవచ్చు కదా!.... ఇలా అనుకోని ఊరుకోక, పైకి అనేసింది.. “నా జుట్టు నా ఇష్టం” అంటూ ధుమధుమలాడాడు వెంకట్రావు. అంతే! మాటా మాటా పెరిగింది. చివరికి ఇద్దరూ ఎడ మొహం పెడ మొహంతో వ్రతానికి వెళ్లారు. సహస్ర చంద్ర దర్శనం చేసిన పెద్దాయన శేషయ్య వీళ్ళని చూసి ఉత్సాహంగా పలకరించారు. “ఓహో, చిలుకా గోరువంకలు సమయానికి వచ్చేశారే!” అన్నారు శేషయ్య వాళ్ళిద్దర్నీ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ. ఆ ఇద్దరూ మొహం మీద కొంచెం నవ్వు పులుముకుని, “నమస్కారం" అన్నారు. సహజంగా పుట్టుకొచ్చిన నవ్వుకి, అసహజంగా పులుముకున్న నవ్వుకి తేడా బాగా తెలిసిన వయస్సు, అనుభవం శేషయ్యగారిది..............© 2017,www.logili.com All Rights Reserved.