మనిషి కుల మత వర్గ భేదాలకు అతీతంగా ఎదగాలి. అన్ని వాదాల్లోకి మానవతా వాదం గొప్పది. మార్కెట్ ఎకానమీ మనిషిని పరాయీకరణలోకి నెట్టి మనిషితనాన్ని చెల్లాచెదురు చేసి ఒక సరికొత్త సంక్షోభాన్ని సృష్టిస్తోంది. మానవ జీవితాల్లోని ఈ సంక్షోభాన్ని ఎంతో కొంత పట్టుకోవాలన్న ప్రయత్నంలోంచి వచ్చినవే ఈ కథలు. రచయిత ఏదైనా ఒక సమస్యను ప్రస్తావించినప్పుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా రచయితే సూచించాలని సాధారణంగా పాఠకులు భావిస్తుంటారు. నిజానికి నిజజీవితంలో తనకు నచ్చినదాని గురించో నచ్చని దాని గురించో చెప్పడమే రచయిత పని.
సమస్యను గుర్తించడటమే అక్కడ ప్రధానం. ఏ సమస్య అయినా బహుముఖంగా ఉంటుంది. ఏ సమస్యనైనా నిర్దుష్టంగా ఇదే పరిష్కారం అని చెప్పడం ఏ రచయితకూ సాధ్యం కాదు. పరిష్కారానికి కొంత సమీపంగా మాత్రమే వెళ్ళగలడు. నేను కూడా ఆ ప్రయత్నమే చేశాను.
- జి లక్ష్మి
మనిషి కుల మత వర్గ భేదాలకు అతీతంగా ఎదగాలి. అన్ని వాదాల్లోకి మానవతా వాదం గొప్పది. మార్కెట్ ఎకానమీ మనిషిని పరాయీకరణలోకి నెట్టి మనిషితనాన్ని చెల్లాచెదురు చేసి ఒక సరికొత్త సంక్షోభాన్ని సృష్టిస్తోంది. మానవ జీవితాల్లోని ఈ సంక్షోభాన్ని ఎంతో కొంత పట్టుకోవాలన్న ప్రయత్నంలోంచి వచ్చినవే ఈ కథలు. రచయిత ఏదైనా ఒక సమస్యను ప్రస్తావించినప్పుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా రచయితే సూచించాలని సాధారణంగా పాఠకులు భావిస్తుంటారు. నిజానికి నిజజీవితంలో తనకు నచ్చినదాని గురించో నచ్చని దాని గురించో చెప్పడమే రచయిత పని. సమస్యను గుర్తించడటమే అక్కడ ప్రధానం. ఏ సమస్య అయినా బహుముఖంగా ఉంటుంది. ఏ సమస్యనైనా నిర్దుష్టంగా ఇదే పరిష్కారం అని చెప్పడం ఏ రచయితకూ సాధ్యం కాదు. పరిష్కారానికి కొంత సమీపంగా మాత్రమే వెళ్ళగలడు. నేను కూడా ఆ ప్రయత్నమే చేశాను. - జి లక్ష్మి© 2017,www.logili.com All Rights Reserved.