డావ్లో అంటే విషాదగీతం. దీనికి బంజారా జీవితంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరూ దీన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. తమ దుఃఖాన్ని డావ్లో రూపంలో వ్యక్త పరుస్తారు. "డావ్లో" లోని కథలు భిన్నంగా ఉన్నాయి. ఇవి చదివినప్పుడు జానపద కథలేమో అనిపిస్తాయి. కానీ బంజారాల సంస్కృతి సంప్రదాయాల మార్మిక దృక్పధాన్ని ఈ కథల్లో ప్రతి చోట మనకు భోదిస్తాడు రమేష్. ఇప్పటిదాకా బంజారాల గురించి వారు మీరు చెప్తే విన్నాం. ఇప్పుడు ఆ తెగ నుండి వస్తున్న తొలి కథా సంపుటి "డావ్లో" . ఇది బంజారా సాహిత్యానికి మంచి శుభ పరిణామం.