తొలి అమ్మ మాదిరే గదా, తొలి కతా! ఏదన్నా ఒక గీత గీసుకుంటే తప్ప తొలి అని దేన్నయినా అనుకోలేంగదా. కతలకి సంబంధించినంత దాక ఆ గీత అచ్చు మిషను. అచ్చులోకి వచ్చిన కాణ్ణుంచీ దొరికిన కతల్నే తొలి కతలని అనుకుంటా ఉన్నాం. అనుకుని ఎతుక్కుంటా ఉన్నాం. ఎతుక్కుని ఏరుకుంటా ఉన్నాం. ఏ దేశాన అయినా, ఏ భాషలో అయినా ఇదే తీరు.
మన దేశంలో తొట్ట తొలి కత పుట్టింది 1870లో. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఉర్దూ భాషలో రాసిన 'గుజారుహా జమానా' కతని తొలీదని అనుకోవాలి. 1884లో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన 'ఘాటీర్ కథ'నే బెంగాలీలు, వాళ్ళ బాషలో తొలికత అనేసుకున్నారు. 1890లో మరాఠీ భాషలో హరినారాయణ ఆప్టే రాసిన 'దహా రూపాయాంచీ ఫేడ్'ని తొలికతగా చెప్పుకుంటా ఉండారు. మలయాళంలో 1891లో తొలి కత అచ్చయితే, ఒడియాలో 1898లో తొలికత వచ్చింది. కన్నడ, గుజరాతీ, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో 1900 తర్వాతే తొలి కతలు వచ్చాయి. కొంకణి, తుళు భాషల్లో 1933 దాకా కత లేదు. కాశ్మీరీలో 1955లో గాని తొలి కత రాలేదు. అంటే అప్పటి దాకా ఇక్కడ అమ్మలూ, అవ్వలూ, తాతలూ పిలకాయలకి కతలే చెప్పలేదని కాదు. చెప్పిన కతలు అచ్చుకాలేదు.
ఈ పుస్తకంలో 13 భారతీయ భాషల తొలి కతలు అందిస్తున్నాము.
- ఆర్. ఎం. ఉమామహేశ్వరరావు
ఇందులో కధలు వరుసగా ......
గడిచిపోయిన కాలం ఉర్దూ సయ్యద్ అహ్మద్ ఖాన్
రేవు కధ బెంగాలీ రవీంద్రనాథ్ ఠాగూర్
పది రూపాయల బాకీ తీర్పు మరాఠీ హరినారాయణ్ ఆప్టే
వారసత్వం మలయాళం కున్హిరామన్ నయనార్
రేవతి ఒడియా ఫకీర్ మోహన్ సేనాపతి
కమలాపురం హోటల్లో కన్నడ పంజె మంగేశ రాయ
శాంతిదాసు గుజరాతీ అంబాలాల్ దేశాయ్
ధనత్రయోదశి తెలుగు భండారు అచ్చమాంబ
కుంభమేలాలో చిన్నకోడలు హిందీ బంగ మహిళ
గుంటకట్ట రాగిమాను... తమిళం వ.వే.సు. అయ్యర్
దిద్దుబాటు తెలుగు గురజాడ అప్పారావు
మాఅమ్మ ఎక్కడికి పోయింది కొంకణి శనై గోయబాబ
పెండ్లికూతురు కాదు.... తుళు కె.విఠల్ హెగ్డే
మాయపొర కాశ్మీర్ అఖ్తర్ మొహియుద్దీన్
తొలి అమ్మ మాదిరే గదా, తొలి కతా! ఏదన్నా ఒక గీత గీసుకుంటే తప్ప తొలి అని దేన్నయినా అనుకోలేంగదా. కతలకి సంబంధించినంత దాక ఆ గీత అచ్చు మిషను. అచ్చులోకి వచ్చిన కాణ్ణుంచీ దొరికిన కతల్నే తొలి కతలని అనుకుంటా ఉన్నాం. అనుకుని ఎతుక్కుంటా ఉన్నాం. ఎతుక్కుని ఏరుకుంటా ఉన్నాం. ఏ దేశాన అయినా, ఏ భాషలో అయినా ఇదే తీరు. మన దేశంలో తొట్ట తొలి కత పుట్టింది 1870లో. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఉర్దూ భాషలో రాసిన 'గుజారుహా జమానా' కతని తొలీదని అనుకోవాలి. 1884లో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన 'ఘాటీర్ కథ'నే బెంగాలీలు, వాళ్ళ బాషలో తొలికత అనేసుకున్నారు. 1890లో మరాఠీ భాషలో హరినారాయణ ఆప్టే రాసిన 'దహా రూపాయాంచీ ఫేడ్'ని తొలికతగా చెప్పుకుంటా ఉండారు. మలయాళంలో 1891లో తొలి కత అచ్చయితే, ఒడియాలో 1898లో తొలికత వచ్చింది. కన్నడ, గుజరాతీ, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో 1900 తర్వాతే తొలి కతలు వచ్చాయి. కొంకణి, తుళు భాషల్లో 1933 దాకా కత లేదు. కాశ్మీరీలో 1955లో గాని తొలి కత రాలేదు. అంటే అప్పటి దాకా ఇక్కడ అమ్మలూ, అవ్వలూ, తాతలూ పిలకాయలకి కతలే చెప్పలేదని కాదు. చెప్పిన కతలు అచ్చుకాలేదు. ఈ పుస్తకంలో 13 భారతీయ భాషల తొలి కతలు అందిస్తున్నాము. - ఆర్. ఎం. ఉమామహేశ్వరరావు ఇందులో కధలు వరుసగా ...... గడిచిపోయిన కాలం ఉర్దూ సయ్యద్ అహ్మద్ ఖాన్ రేవు కధ బెంగాలీ రవీంద్రనాథ్ ఠాగూర్ పది రూపాయల బాకీ తీర్పు మరాఠీ హరినారాయణ్ ఆప్టే వారసత్వం మలయాళం కున్హిరామన్ నయనార్ రేవతి ఒడియా ఫకీర్ మోహన్ సేనాపతి కమలాపురం హోటల్లో కన్నడ పంజె మంగేశ రాయ శాంతిదాసు గుజరాతీ అంబాలాల్ దేశాయ్ ధనత్రయోదశి తెలుగు భండారు అచ్చమాంబ కుంభమేలాలో చిన్నకోడలు హిందీ బంగ మహిళ గుంటకట్ట రాగిమాను... తమిళం వ.వే.సు. అయ్యర్ దిద్దుబాటు తెలుగు గురజాడ అప్పారావు మాఅమ్మ ఎక్కడికి పోయింది కొంకణి శనై గోయబాబ పెండ్లికూతురు కాదు.... తుళు కె.విఠల్ హెగ్డే మాయపొర కాశ్మీర్ అఖ్తర్ మొహియుద్దీన్
© 2017,www.logili.com All Rights Reserved.