నాది ఒక మాట
సాఫీగా సాగిపోతున్న ఐటీ జీవితం. అడపా ఒక కథ, దడపా ఒక ప్రచురణ. ఇది చాలు అనుకున్న సమయంలో చిన్న ఝలక్. ఆటో పైలట్లో నడుస్తున్న జీవితం హఠాత్తుగా తలకిందులైనట్టు అనిపించింది. ఐటీ రంగం నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఆ సంఘటన గురించి కథ రాయడం, దానికి మంచి స్పందన రావడంతో నా ఆలోచనలు కొత్త కోణం వైపు అడుగులేశాయి. అప్పుడే రైటర్స్ మీటికి ఆహ్వానం వచ్చింది. అక్కడ చిన్న చిన్న పరిచయాలు పెద్దపెద్ద మార్పులు తెచ్చాయి. ఆటో పైలట్లో జీవితం అంత ఖాస్ కాదులే అనిపించింది. రాయడం ఎక్కువైంది. డిప్రెషన్ నుండి ఒక కథ పుడితే మరోటి పక్కనామె పడే ఘర్షణలో నుండి పుట్టింది.
ఇంటర్వ్యూ చేస్తూ చేస్తూ ఆలోచనలు పక్కన ఎండుతున్న కాన్వాస్ బూట్లు దగ్గర ఆగినప్పుడు, 'ఇయ్యాల పొద్దుగాల లేపిన పీనుగు బూట్లు బిడ్డా' అన్నాడు. ఉలిక్కిపడి అతని వంక చూసినప్పుడు చలనం లేని అతని మొహం, లోతైన కళ్ళల్లో సమాధి చేసిన బాధలో నుండి మరొక కథ పుట్టింది.
దొంగిలించిన చీరని తన కూతురి పెళ్ళికి కట్టినప్పుడు ఆమె నిస్సహాయత గురించి..............
నాది ఒక మాట సాఫీగా సాగిపోతున్న ఐటీ జీవితం. అడపా ఒక కథ, దడపా ఒక ప్రచురణ. ఇది చాలు అనుకున్న సమయంలో చిన్న ఝలక్. ఆటో పైలట్లో నడుస్తున్న జీవితం హఠాత్తుగా తలకిందులైనట్టు అనిపించింది. ఐటీ రంగం నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఆ సంఘటన గురించి కథ రాయడం, దానికి మంచి స్పందన రావడంతో నా ఆలోచనలు కొత్త కోణం వైపు అడుగులేశాయి. అప్పుడే రైటర్స్ మీటికి ఆహ్వానం వచ్చింది. అక్కడ చిన్న చిన్న పరిచయాలు పెద్దపెద్ద మార్పులు తెచ్చాయి. ఆటో పైలట్లో జీవితం అంత ఖాస్ కాదులే అనిపించింది. రాయడం ఎక్కువైంది. డిప్రెషన్ నుండి ఒక కథ పుడితే మరోటి పక్కనామె పడే ఘర్షణలో నుండి పుట్టింది. ఇంటర్వ్యూ చేస్తూ చేస్తూ ఆలోచనలు పక్కన ఎండుతున్న కాన్వాస్ బూట్లు దగ్గర ఆగినప్పుడు, 'ఇయ్యాల పొద్దుగాల లేపిన పీనుగు బూట్లు బిడ్డా' అన్నాడు. ఉలిక్కిపడి అతని వంక చూసినప్పుడు చలనం లేని అతని మొహం, లోతైన కళ్ళల్లో సమాధి చేసిన బాధలో నుండి మరొక కథ పుట్టింది. దొంగిలించిన చీరని తన కూతురి పెళ్ళికి కట్టినప్పుడు ఆమె నిస్సహాయత గురించి..............© 2017,www.logili.com All Rights Reserved.