ఆకాశంలో గద్ద కనిపించగానే పిల్లల కోడి తన రెక్కలు విప్పి 'కొక్కొక్కొ' అని కంగారుగా అరుస్తుంది. కోడిపిల్లలు ఎక్కడ ఉన్నా, వెంటనే పరుగెత్తుకు వచ్చి తమ తల్లి రెక్కల కింద దూరుతాయి. ఆ కూత ప్రమాద సూచకం అని ఆ పిల్లలకి అర్థం అయింది. అంతేకాదు, అప్పుడు ఏం చెయ్యాలో కూడా వాటికి తెలిసింది.
తల్లి కోడి పెంటకుప్పని కెక్కరించి, 'కొక్కొక్ కొక్కొక్' అని అరుస్తుంది. 'ఇక్కడ కమ్మని పురుగులున్నాయి. తిందురుగాని త్వరగా రండి అని ఆ పిల్లలు అర్థం చేసుకుని వచ్చి విందు ఆరగిస్తాయి.
- డా. మహీధర నళినీమోహన్
ఆకాశంలో గద్ద కనిపించగానే పిల్లల కోడి తన రెక్కలు విప్పి 'కొక్కొక్కొ' అని కంగారుగా అరుస్తుంది. కోడిపిల్లలు ఎక్కడ ఉన్నా, వెంటనే పరుగెత్తుకు వచ్చి తమ తల్లి రెక్కల కింద దూరుతాయి. ఆ కూత ప్రమాద సూచకం అని ఆ పిల్లలకి అర్థం అయింది. అంతేకాదు, అప్పుడు ఏం చెయ్యాలో కూడా వాటికి తెలిసింది.
తల్లి కోడి పెంటకుప్పని కెక్కరించి, 'కొక్కొక్ కొక్కొక్' అని అరుస్తుంది. 'ఇక్కడ కమ్మని పురుగులున్నాయి. తిందురుగాని త్వరగా రండి అని ఆ పిల్లలు అర్థం చేసుకుని వచ్చి విందు ఆరగిస్తాయి. - డా. మహీధర నళినీమోహన్