చందమామని అందుకోవాలనీ చుక్కలని అక్కున చేర్చుకోవాలనీ మనిషి ఏనాటి నుంచో కలలు కంటున్నాడు. ఆ ఆశ తీర్చే వాహనం రాకెట్. మొదట మనిషి ఉత్సవాల్లో బాణ సంచాలుగా రాకెట్లని ఎగరేశాడు. తర్వాత యుద్ధాల్లో క్షిపణులుగా ప్రయోగించాడు. అయితే అంతరిక్షంలోకి ప్రవేశించాలన్నా చంద్రుడి పై అడుగుపెట్టాలన్నా అంగారకుని చేరుకోవాలన్నా భూమి గురత్వాకర్షణని అధిగమించాలి. అందుకు శాస్త్రపరంగా తొలి అడుగులు వేసిన త్రిమూర్తులు: త్సియాల్కొవస్కీ(రష్యా), గోడార్డ్(అమెరికా), ఓబర్త్(జర్మనీ).
రాకెట్ రంగంలో అమెరికా, సోవియట్ యూనియన్ ల మధ్య తలెత్తిన పోటీ ఆ రంగంలో రెండు దేశాలూ అద్భుతమైన ప్రగతిని సాధించడానికి తోడ్పడింది. భారత్ కూడా తొలుత సోవియట్ సహకారంతోనూ, పిదప స్వయం కృషితోనూ ఆకాశాన్ని అందుకొంది. నిన్నటి మనిషి ప్రయాసలు, నేటి విజయాలు, రేపటి కలలు - వాటి గాథే రాకెట్ కథ.
చందమామని అందుకోవాలనీ చుక్కలని అక్కున చేర్చుకోవాలనీ మనిషి ఏనాటి నుంచో కలలు కంటున్నాడు. ఆ ఆశ తీర్చే వాహనం రాకెట్. మొదట మనిషి ఉత్సవాల్లో బాణ సంచాలుగా రాకెట్లని ఎగరేశాడు. తర్వాత యుద్ధాల్లో క్షిపణులుగా ప్రయోగించాడు. అయితే అంతరిక్షంలోకి ప్రవేశించాలన్నా చంద్రుడి పై అడుగుపెట్టాలన్నా అంగారకుని చేరుకోవాలన్నా భూమి గురత్వాకర్షణని అధిగమించాలి. అందుకు శాస్త్రపరంగా తొలి అడుగులు వేసిన త్రిమూర్తులు: త్సియాల్కొవస్కీ(రష్యా), గోడార్డ్(అమెరికా), ఓబర్త్(జర్మనీ). రాకెట్ రంగంలో అమెరికా, సోవియట్ యూనియన్ ల మధ్య తలెత్తిన పోటీ ఆ రంగంలో రెండు దేశాలూ అద్భుతమైన ప్రగతిని సాధించడానికి తోడ్పడింది. భారత్ కూడా తొలుత సోవియట్ సహకారంతోనూ, పిదప స్వయం కృషితోనూ ఆకాశాన్ని అందుకొంది. నిన్నటి మనిషి ప్రయాసలు, నేటి విజయాలు, రేపటి కలలు - వాటి గాథే రాకెట్ కథ.© 2017,www.logili.com All Rights Reserved.