సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల నాటి కథలు రమణీయ - రసరమ్యం. కవుల కళాకారుల సాహితీ ప్రాభవంతో స్వర్ణయుగ వైభవాన్ని సంతరించుకున్న కళల కాణాచి విజయనగర సామ్రాజ్యం. ఈ 'శ్రీకృష్ణదేవరాయకథలు' సంపుటిలోని ప్రతి కథ ఓ ఆణిముత్యం.
హాస్యం, వ్యంగ్యం, ఆలోచన, తెలివి, చమత్కారం మొదలైన విశేష విశిష్టతల పరిణితిని పెంచే కథలు ఇవి. నాటి కాలంలో కథలు కథలుగా చెప్పబడినా నేటి కాలానికీ ఇవి ఎంతో ఉపయుక్తం. ఆ బాలగోపాలానికీ ఆనందదాయకం. కొన్ని గ్రంథస్థం, మరికొన్ని విని వున్నవి మొత్తం అన్నింటినీ కలిపి ఓ పుస్తకంగా వెలువరించిన డా.వి.ఆర్. రాసాని పాఠకలోకాన్ని మరిపిస్తారు.
చక్కని హాస్యాన్ని, తేలికైన పదాలతో, పొందికైన వ్యాక్యాలతో చక్కని వ్యవహారికంలో అందించిన ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంటుంది. చదివి భద్రపరుచుకోవడమే కాదు, బహుమతిగా ఇవ్వదగిన ఉత్తమ కథా రాజం ఇది.
సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల నాటి కథలు రమణీయ - రసరమ్యం. కవుల కళాకారుల సాహితీ ప్రాభవంతో స్వర్ణయుగ వైభవాన్ని సంతరించుకున్న కళల కాణాచి విజయనగర సామ్రాజ్యం. ఈ 'శ్రీకృష్ణదేవరాయకథలు' సంపుటిలోని ప్రతి కథ ఓ ఆణిముత్యం. హాస్యం, వ్యంగ్యం, ఆలోచన, తెలివి, చమత్కారం మొదలైన విశేష విశిష్టతల పరిణితిని పెంచే కథలు ఇవి. నాటి కాలంలో కథలు కథలుగా చెప్పబడినా నేటి కాలానికీ ఇవి ఎంతో ఉపయుక్తం. ఆ బాలగోపాలానికీ ఆనందదాయకం. కొన్ని గ్రంథస్థం, మరికొన్ని విని వున్నవి మొత్తం అన్నింటినీ కలిపి ఓ పుస్తకంగా వెలువరించిన డా.వి.ఆర్. రాసాని పాఠకలోకాన్ని మరిపిస్తారు. చక్కని హాస్యాన్ని, తేలికైన పదాలతో, పొందికైన వ్యాక్యాలతో చక్కని వ్యవహారికంలో అందించిన ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంటుంది. చదివి భద్రపరుచుకోవడమే కాదు, బహుమతిగా ఇవ్వదగిన ఉత్తమ కథా రాజం ఇది.© 2017,www.logili.com All Rights Reserved.