అప్పటికి చాలా వారాలుగా శత్రుసైనికులు నగరాన్ని చుట్టుముట్టి ఉన్నారు. రాత్రిపూట నెగళ్ళు లేస్తున్నాయి, కొన్ని వేల జతల ఎర్రని తీక్షణమైన కళ్ళు చీకటిలో గోడలవైపు చూస్తున్నాయి. ఆ చలినెగళ్ళతీరు అశుభాన్ని సూచిస్తూ, ఆ నగర ప్రజలని హెచ్చరిస్తున్నట్టు ఉంది. అవి రేకెత్తించే ఆలోచనలు భయంకరంగా ఉన్నాయి.
నగర ప్రాకారపు గోడలనుండి పరికిస్తే, శత్రువు నగరం మీద తన ఉచ్చును రోజు రోజుకి గట్టిగా బిగిస్తున్నాడని అర్ధమైపోతుంది. ఆ మంటల చుట్టూ నల్లని నీడలు అటూ ఇటూ కదలాడడం తెలుస్తుంది . బాగా మేపిన అశ్వాల సకిలింపులతో పాటు, ఆయుధాల మోతలు, గెలుపుమీద ధీమా ఉన్న సైనికుల వికటాట్టహాసాలూ, ఆనందంతో పాడే పాటలు వినిపిస్తాయి. శత్రువుల పాటలూ, నవ్వులూ వినడం కంటే భాదాకరమైనది ఏముంటుంది?