కవిత్వంతో కబురులు ఆడదామంటే... చినిగిన బతుకు బట్టను చెలిమి దారంతో కట్టుకోవడమే. కవిత్వంతో కూనిరాగాలు తీయడమంటే... మనసు వెంట సాగే మనియాద గుంజాటనలో వొంపుకున్న నిజం జాడల్ని వెతుక్కోవడమే. కవిత్వంతో కరచాలనం చేయడమంటే... నదిని చుట్టి వచ్చిన పాదస్పర్శతో పసిడి పంటల చుట్టూ ప్రదక్షిణం చేసుకోవడమే. కవిత్వాన్ని కళ్ళకద్దుకోవడమంటే... డాలర్ నోట్లోంచి ఊడిపడ్డ డాంబికాన్ని పుటం పెట్టి నివురు చేయడమే. కవిత్వాన్ని చుంబించడమంటే... నునుపుచెంపల మీద నురగలు నురగాలుగా నవ్వు తుమ్పరాల్ని ఆరేసుకోవడమే. కవిత్వాన్ని కౌగిలించు కోవడమంటే... వర్షధారల్లో ఒదిగిన గువ్వాపిట్టను మెడమెచ్చుతనంతో మేగుకోవడమే. కవిత్వంతో కలసి నడవడమంటే... ఎక్కడో ఒక చోట అందమైన అనుభూతితో గుండె కండె దారాన్ని చిక్కు తీసుకోవడమే.
ఇప్పుడు అనేకానేక సామాజిక పరిణామాల మధ్య అనుభవ కవిత్వం ఎక్కువగా వెలువడుతోంది. ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద వికృతరూపాలు, కళ్ళముందు విస్తరించే వస్తు విశ్వం, ధన దాహం, పదవీ వ్యామోహం, యాంత్రిక జీవన వేగం, మనిషి ఏకాకితనం, యువత విచ్చలవిడి వికారం ఇత్యాది నేపధ్యాలకి భిన్నంగా మానవీయతను కాపాడుకునే కవితా ప్రయత్నమే ఈ 'వేకువపిట్ట'.
కవిత్వంతో కబురులు ఆడదామంటే... చినిగిన బతుకు బట్టను చెలిమి దారంతో కట్టుకోవడమే. కవిత్వంతో కూనిరాగాలు తీయడమంటే... మనసు వెంట సాగే మనియాద గుంజాటనలో వొంపుకున్న నిజం జాడల్ని వెతుక్కోవడమే. కవిత్వంతో కరచాలనం చేయడమంటే... నదిని చుట్టి వచ్చిన పాదస్పర్శతో పసిడి పంటల చుట్టూ ప్రదక్షిణం చేసుకోవడమే. కవిత్వాన్ని కళ్ళకద్దుకోవడమంటే... డాలర్ నోట్లోంచి ఊడిపడ్డ డాంబికాన్ని పుటం పెట్టి నివురు చేయడమే. కవిత్వాన్ని చుంబించడమంటే... నునుపుచెంపల మీద నురగలు నురగాలుగా నవ్వు తుమ్పరాల్ని ఆరేసుకోవడమే. కవిత్వాన్ని కౌగిలించు కోవడమంటే... వర్షధారల్లో ఒదిగిన గువ్వాపిట్టను మెడమెచ్చుతనంతో మేగుకోవడమే. కవిత్వంతో కలసి నడవడమంటే... ఎక్కడో ఒక చోట అందమైన అనుభూతితో గుండె కండె దారాన్ని చిక్కు తీసుకోవడమే. ఇప్పుడు అనేకానేక సామాజిక పరిణామాల మధ్య అనుభవ కవిత్వం ఎక్కువగా వెలువడుతోంది. ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద వికృతరూపాలు, కళ్ళముందు విస్తరించే వస్తు విశ్వం, ధన దాహం, పదవీ వ్యామోహం, యాంత్రిక జీవన వేగం, మనిషి ఏకాకితనం, యువత విచ్చలవిడి వికారం ఇత్యాది నేపధ్యాలకి భిన్నంగా మానవీయతను కాపాడుకునే కవితా ప్రయత్నమే ఈ 'వేకువపిట్ట'.© 2017,www.logili.com All Rights Reserved.