మామిడి కాయ పప్పు, చల్లమిరపకాయలు, గుమ్మడి వడియాలు, గుత్తివంకాయ కూర, ధనియాలు కొబ్బరి కలిపి దేశవాళి ఆనపకాయ ముక్కలు వేసిన చల్లపూలుసు, ఎర్రగాకాచి తోడెట్టిన గెడ్డ పెరుగు, వెన్నకంచినా ఘుమ ఘుమలాడే నెయ్యి, మామిడిపళ్ళతో నోరూరించే ఘనమైన భోజనం వచ్చింది. అంత మధురమైన భోజనం తిని ఎన్నిరోజులైందో? ఆ భోజనం నాతోపాటు మిగిలినవాళ్ళుకూడా సుష్టుగా తినడం వలన ఆ రోజు నేను పని కూడా ఎక్కువగా చెయ్యలేక ఇంటికి వచ్చి నిద్రపోయాను.
మధ్యాహ్నం లేచేసరికి రాజారావు నేతి పూతరేకులు, శనగ వడలు తెచ్చిపెట్టాడు. పూతరేకులు ఎక్కడివి అని అడిగితే రామరాజు దొరగారు ఆత్రేయపురం నుంచి తెప్పించారండి అన్నాడు. నోట్లో వేసుకోగానే అవి కరిగిపోయాయి.
- చాగంటి ప్రసాద్