ఇవి సరికొత్త కథలు. మూసలో పోసిన కథలు కావివి. నూతన సంవిధానంలో నడిచిన కథలు. వేటికవే ప్రత్యేకత గల కథలు. సమకాలిక తెలుగు కథా సాహిత్యంలోనే విభిన్నమైన కథలు. కొత్త కాలం నుంచి జాలువారిన కథలు. అనుభవం నుంచి సహానుభావంలోంచి వచ్చిన కథలు. జీవితాలను దగ్గరగా పరీశీలించి రాసిన కథలు. పోల్లుబోని కథలు. చిక్కని కథలు. తగదునని ఉపదేశాలు చేయవీ కథలు. స్పందింపజేస్తాయి, ఆలోచింపజేస్తాయి. పనిగట్టుకొని నీతులు చెప్పవీ కథలు. అవగాహన కలిగించడమే ఈ కథలు చేసే పని. తొలి ప్రయత్నాలలోనే పరిపక్వతను, పరిణితిని సాధించాయి ఈ కథలు.
ఈ కథలలో వస్తువైవిధ్యం ఉంది. వ్యక్తులు, సన్నివేశాలు, ఘటనల సూక్ష్మాంశ పరిశీలనలున్నాయి. కథలు రచయిత్రి స్వయంగా విన్నవి, తెలుసుకున్నవి, అనుభవించినవిగా కనిపిస్తాయి. జరిగింది జరిగినట్టు దిగిందని అనిపించే కథలూ ఉన్నాయి. రోజూవారి జీవితంలో క్షణం తీరిక లేని ఉన్నత కుటుంబాల నిరుత్పాదక ఆడంబర జీవితం ఉంది. దానిని ఆనుకొనే రోజంతా చాకిరి తప్ప ఏమీ లేని చితికిన జీవితం ఉంది. ఇవి సామాన్య కథలేకాని సామాన్య కథలు కావు, అసామాన్య కథలు.
ఇవి సరికొత్త కథలు. మూసలో పోసిన కథలు కావివి. నూతన సంవిధానంలో నడిచిన కథలు. వేటికవే ప్రత్యేకత గల కథలు. సమకాలిక తెలుగు కథా సాహిత్యంలోనే విభిన్నమైన కథలు. కొత్త కాలం నుంచి జాలువారిన కథలు. అనుభవం నుంచి సహానుభావంలోంచి వచ్చిన కథలు. జీవితాలను దగ్గరగా పరీశీలించి రాసిన కథలు. పోల్లుబోని కథలు. చిక్కని కథలు. తగదునని ఉపదేశాలు చేయవీ కథలు. స్పందింపజేస్తాయి, ఆలోచింపజేస్తాయి. పనిగట్టుకొని నీతులు చెప్పవీ కథలు. అవగాహన కలిగించడమే ఈ కథలు చేసే పని. తొలి ప్రయత్నాలలోనే పరిపక్వతను, పరిణితిని సాధించాయి ఈ కథలు. ఈ కథలలో వస్తువైవిధ్యం ఉంది. వ్యక్తులు, సన్నివేశాలు, ఘటనల సూక్ష్మాంశ పరిశీలనలున్నాయి. కథలు రచయిత్రి స్వయంగా విన్నవి, తెలుసుకున్నవి, అనుభవించినవిగా కనిపిస్తాయి. జరిగింది జరిగినట్టు దిగిందని అనిపించే కథలూ ఉన్నాయి. రోజూవారి జీవితంలో క్షణం తీరిక లేని ఉన్నత కుటుంబాల నిరుత్పాదక ఆడంబర జీవితం ఉంది. దానిని ఆనుకొనే రోజంతా చాకిరి తప్ప ఏమీ లేని చితికిన జీవితం ఉంది. ఇవి సామాన్య కథలేకాని సామాన్య కథలు కావు, అసామాన్య కథలు.© 2017,www.logili.com All Rights Reserved.