సంక్రాంతి రోజు ఉదయం 10.30 గంటల సమయం. నెల రోజుల పాటు పని ఒత్తిడితో, నిద్ర లేమితో, సాగిన మా ప్రయాణం మరో గంట, గంటన్నర ముగించి, ఇంటికి వెళ్ళిపోతాము. ఇంటికి వెళ్లిన వెంటనే కాస్త తినేసి, నిద్ర ఉ పక్రమించాలి. చాలా కాలం నుండి మా ఇంట్లో ఒక స్పాంజ్ పరుపు వుంది. అసలే నిద్ర లేమితో ఉంటామేమో, ఆ చలి కాలంలో, ఆ పరుపు మీద దుప్పటి కప్పుకొని పడుకొంటే, స్వర్గం ఎక్కడో ఉండదు. అలా ఇంటికి వెళ్లి ఏకబిగిన 20 గంటలు పడుకున్న రోజులు కూడా వున్నాయి.
అప్పటికే కుర్రవాళ్ళంతా వెళ్లిపోయారు. కుట్టవలసిన బట్టలన్నీ తయారై పోయాయి. ఇంకా తీసుకువెళ్లవలసినవి 7,8 జతలు మాత్రమే వున్నాయి. కుర్రవాళ్ళు కూడా సొంత బట్టలు కుట్టేసుకొని ఇళ్లళ్లకు వెళ్లిపోయారు. నాకైతే కొత్త బట్టలు కుట్టుకోవాలన్న కోరికా, తీరికా రెండూ లేవు. కస్టమర్స్తో మాట పడకుండా ఇవ్వవలసిన వాళ్లకు బట్టలు కుట్టి ఇచ్చేస్తే అంతే చాలు. నేనూ, చిన్న కుర్రాడు సంతోష్ మాత్రమే వున్నాం. ఇద్దరం కలసి షాపు తుడుస్తున్నాము. అది ప్రతి సంవత్సరం జరిగే ఆనవాయితీయే కాదు, శుభ్రత కూడా. మూలనున్న చెత్తా, చెదారం బయట పారేసి, షాపు కట్టేసి, నాలుగు రోజుల వరకూ కొట్టు మొహం చూడము. మేము షాపు కట్టే సమయానికి కూడా రాని కస్టమర్స్ కొందరు వుంటారు. వాళ్ళ బట్టలు ఎవరివి వాళ్ళవి కవర్లలో పెట్టేసి, ఇంటికి తీసుకువెళ్లిపోతాము. ఎందుకంటే కొంతమంది ఏవేవో కారణాల మీద రాలేక పోతారు. అలాంటి వాళ్ళు ఇంటికి వస్తారు. వచ్చి, "బట్టలు ఇమ్మంటారు”. వాళ్ళ మాట కాదనలేక అప్పుడు షాపు తీసి బట్టలు ఇవ్వాలి. అందుకని ఇంటి దగ్గరే బట్టలు ఉంటే ఆ బాధ ఉండదు.
మేము సంక్రాంతికి షాపు కట్టే సమయం ప్రతి సంవత్సరం ఒకేలా ఉండదు. అది ఆ సంవత్సరం పడే పూజ టైము మీద ఆధారపడి ఉంటుంది. ఆ సంవత్సరం పూజ 11.30కి పడింది. అంటే, మేము 11.30 ముందు కట్టెయ్యకూడదు. ఎందుకంటే,.........................
అత్తారింటికి దారేది? సంక్రాంతి రోజు ఉదయం 10.30 గంటల సమయం. నెల రోజుల పాటు పని ఒత్తిడితో, నిద్ర లేమితో, సాగిన మా ప్రయాణం మరో గంట, గంటన్నర ముగించి, ఇంటికి వెళ్ళిపోతాము. ఇంటికి వెళ్లిన వెంటనే కాస్త తినేసి, నిద్ర ఉ పక్రమించాలి. చాలా కాలం నుండి మా ఇంట్లో ఒక స్పాంజ్ పరుపు వుంది. అసలే నిద్ర లేమితో ఉంటామేమో, ఆ చలి కాలంలో, ఆ పరుపు మీద దుప్పటి కప్పుకొని పడుకొంటే, స్వర్గం ఎక్కడో ఉండదు. అలా ఇంటికి వెళ్లి ఏకబిగిన 20 గంటలు పడుకున్న రోజులు కూడా వున్నాయి. అప్పటికే కుర్రవాళ్ళంతా వెళ్లిపోయారు. కుట్టవలసిన బట్టలన్నీ తయారై పోయాయి. ఇంకా తీసుకువెళ్లవలసినవి 7,8 జతలు మాత్రమే వున్నాయి. కుర్రవాళ్ళు కూడా సొంత బట్టలు కుట్టేసుకొని ఇళ్లళ్లకు వెళ్లిపోయారు. నాకైతే కొత్త బట్టలు కుట్టుకోవాలన్న కోరికా, తీరికా రెండూ లేవు. కస్టమర్స్తో మాట పడకుండా ఇవ్వవలసిన వాళ్లకు బట్టలు కుట్టి ఇచ్చేస్తే అంతే చాలు. నేనూ, చిన్న కుర్రాడు సంతోష్ మాత్రమే వున్నాం. ఇద్దరం కలసి షాపు తుడుస్తున్నాము. అది ప్రతి సంవత్సరం జరిగే ఆనవాయితీయే కాదు, శుభ్రత కూడా. మూలనున్న చెత్తా, చెదారం బయట పారేసి, షాపు కట్టేసి, నాలుగు రోజుల వరకూ కొట్టు మొహం చూడము. మేము షాపు కట్టే సమయానికి కూడా రాని కస్టమర్స్ కొందరు వుంటారు. వాళ్ళ బట్టలు ఎవరివి వాళ్ళవి కవర్లలో పెట్టేసి, ఇంటికి తీసుకువెళ్లిపోతాము. ఎందుకంటే కొంతమంది ఏవేవో కారణాల మీద రాలేక పోతారు. అలాంటి వాళ్ళు ఇంటికి వస్తారు. వచ్చి, "బట్టలు ఇమ్మంటారు”. వాళ్ళ మాట కాదనలేక అప్పుడు షాపు తీసి బట్టలు ఇవ్వాలి. అందుకని ఇంటి దగ్గరే బట్టలు ఉంటే ఆ బాధ ఉండదు. మేము సంక్రాంతికి షాపు కట్టే సమయం ప్రతి సంవత్సరం ఒకేలా ఉండదు. అది ఆ సంవత్సరం పడే పూజ టైము మీద ఆధారపడి ఉంటుంది. ఆ సంవత్సరం పూజ 11.30కి పడింది. అంటే, మేము 11.30 ముందు కట్టెయ్యకూడదు. ఎందుకంటే,.........................© 2017,www.logili.com All Rights Reserved.