మృతజీవులు
రష్యన్ మూలం : నికొలాయ్ గొగోల్
పరిచయం :
ఎ. గాంధీ
Dead Souls
ఇది రష్యాలో తొలి ఆధునిక నవల. రచయిత నికొలాయ్ గొగోల్. నవల కధా కాలం రష్యాలో కమ్యునిస్టులు అధికారంలోకి రావడానికి ఏడు దశాబ్దాల ముందు. అంటే దాదాపు 1847 ప్రాంతాలలో. అప్పుడు బహుశా జార్ పరిపాలనలో ఉండవచ్చు. ఇందులో అంతా జమిందారులూ, భూస్వాములూ, గవర్నర్లూ, కల్నల్లూ, జడ్జీలూ, ఉన్నత స్థాయి అధికారులూ ఇంకా ఇలాంటి ఆర్ధికంగా పై స్థాయి వారే. ఆ నాటి రష్యా ఎంత కుళ్ళిపోయిందో ఈ కధలో కనిపిస్తుంది. అవినీతీ, లంచాలూ, మోసాలూ, ఫోర్జరీలూ, లాలూచీలూ, డబ్బూ, తాగుడూ, తిండీ, విందులూ, వినోదాలూ, విలాసాలు ఇదే. ఇంకా ఇలాంటి అవలక్షణాలు అన్నీ కనిపిస్తాయి. ఇందులో పేదవాళ్ళు ఎక్కడా కనిపించరు. ఇదొక వ్యంగ్య రచన. కుళ్ళిన రష్యన్ సమాజంపై రాసిన విమర్శాత్మక వ్యంగ్య రచన. కధను నడిపించేవాడే కథానాయకుడు అయితే, ఈ కధలో కధానాయకుడు చిచీకవ్. పూర్తి పేరు "పావెల్ ఇవానవిచ్ చిచీకవ్" మన గిరీశానికి ఏ మాత్రమూ తీసిపోడు. ఈ కధలో చెప్పుకోదగ్గ మెలికలూ, ఆశక్తికరమైన మలుపులు ఏమీ ఉండవు. అంతా సాఫీగా సాగిపోతుంది. అసలు నవల పేరే తమాషాగా “మృత జీవులు" అని పెట్టారు. “మృత" అంటే చనిపోవడం. “జీవులు" అంటే జీవించి ఉండడం. మరి మృత జీవులు ఏమిటి? కానీ, సగం కధ చదివిన తరువాత తెలిసింది. ఈ కధకు ఇది ఎంత సరైన పేరో. ఇక లోనికి వెళితే....
రష్యాలోని ఒక చిన్న పట్టణం. అందులో ఒక చిన్న స్థాయి హెూటల్ ముందు గుర్రపు బండి వచ్చి ఆగింది. బండి వాడు సేలిఫాన్. అందులో నుండి దిగాడు చిచీకవ్. రోజుకు రెండు రూబుళ్ళకు గది అద్దెకు తీసుకున్నాడు. నౌకరు పెత్రుష్కా సామానులన్నీ గదిలో సర్దాడు. కింద హాలులోకి వచ్చాడు. పై కప్పు మట్టికొట్టుకు పోయింది. గోడల నిండా తైల వర్ణ చిత్రాలు ఉన్నాయి. 'ఒక చిత్తరువులో స్త్రీకి ఎంత పెద్ద రొమ్ములు ఉన్నాయంటే, అలాంటివి బయట ఎక్కడా చూడలేదు. రష్యాకి దిగుమతి అయ్యే చిత్రాలలో ఇలాంటి విడ్డూరాలు ఉంటాయి.' అనుకున్నాడు. (అబ్బా! ఏం అభిరుచి?)...............
మృతజీవులు రష్యన్ మూలం : నికొలాయ్ గొగోల్ పరిచయం : ఎ. గాంధీ Dead Souls ఇది రష్యాలో తొలి ఆధునిక నవల. రచయిత నికొలాయ్ గొగోల్. నవల కధా కాలం రష్యాలో కమ్యునిస్టులు అధికారంలోకి రావడానికి ఏడు దశాబ్దాల ముందు. అంటే దాదాపు 1847 ప్రాంతాలలో. అప్పుడు బహుశా జార్ పరిపాలనలో ఉండవచ్చు. ఇందులో అంతా జమిందారులూ, భూస్వాములూ, గవర్నర్లూ, కల్నల్లూ, జడ్జీలూ, ఉన్నత స్థాయి అధికారులూ ఇంకా ఇలాంటి ఆర్ధికంగా పై స్థాయి వారే. ఆ నాటి రష్యా ఎంత కుళ్ళిపోయిందో ఈ కధలో కనిపిస్తుంది. అవినీతీ, లంచాలూ, మోసాలూ, ఫోర్జరీలూ, లాలూచీలూ, డబ్బూ, తాగుడూ, తిండీ, విందులూ, వినోదాలూ, విలాసాలు ఇదే. ఇంకా ఇలాంటి అవలక్షణాలు అన్నీ కనిపిస్తాయి. ఇందులో పేదవాళ్ళు ఎక్కడా కనిపించరు. ఇదొక వ్యంగ్య రచన. కుళ్ళిన రష్యన్ సమాజంపై రాసిన విమర్శాత్మక వ్యంగ్య రచన. కధను నడిపించేవాడే కథానాయకుడు అయితే, ఈ కధలో కధానాయకుడు చిచీకవ్. పూర్తి పేరు "పావెల్ ఇవానవిచ్ చిచీకవ్" మన గిరీశానికి ఏ మాత్రమూ తీసిపోడు. ఈ కధలో చెప్పుకోదగ్గ మెలికలూ, ఆశక్తికరమైన మలుపులు ఏమీ ఉండవు. అంతా సాఫీగా సాగిపోతుంది. అసలు నవల పేరే తమాషాగా “మృత జీవులు" అని పెట్టారు. “మృత" అంటే చనిపోవడం. “జీవులు" అంటే జీవించి ఉండడం. మరి మృత జీవులు ఏమిటి? కానీ, సగం కధ చదివిన తరువాత తెలిసింది. ఈ కధకు ఇది ఎంత సరైన పేరో. ఇక లోనికి వెళితే.... రష్యాలోని ఒక చిన్న పట్టణం. అందులో ఒక చిన్న స్థాయి హెూటల్ ముందు గుర్రపు బండి వచ్చి ఆగింది. బండి వాడు సేలిఫాన్. అందులో నుండి దిగాడు చిచీకవ్. రోజుకు రెండు రూబుళ్ళకు గది అద్దెకు తీసుకున్నాడు. నౌకరు పెత్రుష్కా సామానులన్నీ గదిలో సర్దాడు. కింద హాలులోకి వచ్చాడు. పై కప్పు మట్టికొట్టుకు పోయింది. గోడల నిండా తైల వర్ణ చిత్రాలు ఉన్నాయి. 'ఒక చిత్తరువులో స్త్రీకి ఎంత పెద్ద రొమ్ములు ఉన్నాయంటే, అలాంటివి బయట ఎక్కడా చూడలేదు. రష్యాకి దిగుమతి అయ్యే చిత్రాలలో ఇలాంటి విడ్డూరాలు ఉంటాయి.' అనుకున్నాడు. (అబ్బా! ఏం అభిరుచి?)...............© 2017,www.logili.com All Rights Reserved.