కథలు ఎందుకు రాస్తున్నాను అంటే - చిన్నతనం మీద ప్రేమ వదలక. జీవితాన్ని రోజూవారీ ప్రపంచంలోనే ఇంకొంచెం విశాలంగా జీవించాలి అని కోరుకునే హక్కుని వదులుకోలేక అనే చెప్పాలి. దాదాపు అన్ని కథల్లో ప్రోటోగనిస్ట్ స్త్రీ. మొదట్లో కథలు రాస్తున్నప్పుడు ఆ టీనేజ్ కి సంబంధించిన చూపుని, ఒక టీనేజర్ అంతరంగాన్ని, ఒక స్త్రీ దృష్టికోణాన్ని ప్రతిబింబించే కథలు 'మనసుకో దాహం' లో, అప్పుడప్పుడే కుటుంబ వాతావరణం నుంచి బయటకి అడుగు పెట్టాలంటే ఎలా పెట్టాలని ఆలోచించుకుంటూ నిలబడటానికి నగరముందని నగరానికి వచ్చే అమ్మాయిలూ, ఉన్న నగరం చాలా వేగంగా మారిపోతుండటం, సంక్లిష్టంగా ఉండటం, ఇలాంటి చోట ఎలా నిలబడాలి అనుకుంటున్నా వాళ్ళు కథలు 'ముక్త' లో రాశాను.
నగరంలో వస్తున్నా మార్పులకి కారణం ప్రపంచంలో వస్తున్నా అనేక మార్పులు అనే విషయం అర్థమవుతున్నప్పుడు 'సాలభంజిక' కథలు చెప్పటం, అన్నీ ఉండి కూడా ఎదుర్కొంటున్న ఎమోషనల్ వయోలెన్స్ ని 'మంచుపూల వాన' లో, రవ్వంత ప్రేమ కూడా బయటి ప్రపంచంలో ఎలా బాధాకరమవుతుందో 'వాన చెప్పిన రహస్యం' లో చెపితే, వీటన్నిటి మధ్య నిలబడి వెతుక్కుంటున్న చోటులో దాదాపు అన్ని విధాలా కోల్పోతున్న అమాయకత్వం 'ది లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్' లో ప్రతిబింబించాయి.
- కుప్పిలి పద్మ
కథలు ఎందుకు రాస్తున్నాను అంటే - చిన్నతనం మీద ప్రేమ వదలక. జీవితాన్ని రోజూవారీ ప్రపంచంలోనే ఇంకొంచెం విశాలంగా జీవించాలి అని కోరుకునే హక్కుని వదులుకోలేక అనే చెప్పాలి. దాదాపు అన్ని కథల్లో ప్రోటోగనిస్ట్ స్త్రీ. మొదట్లో కథలు రాస్తున్నప్పుడు ఆ టీనేజ్ కి సంబంధించిన చూపుని, ఒక టీనేజర్ అంతరంగాన్ని, ఒక స్త్రీ దృష్టికోణాన్ని ప్రతిబింబించే కథలు 'మనసుకో దాహం' లో, అప్పుడప్పుడే కుటుంబ వాతావరణం నుంచి బయటకి అడుగు పెట్టాలంటే ఎలా పెట్టాలని ఆలోచించుకుంటూ నిలబడటానికి నగరముందని నగరానికి వచ్చే అమ్మాయిలూ, ఉన్న నగరం చాలా వేగంగా మారిపోతుండటం, సంక్లిష్టంగా ఉండటం, ఇలాంటి చోట ఎలా నిలబడాలి అనుకుంటున్నా వాళ్ళు కథలు 'ముక్త' లో రాశాను. నగరంలో వస్తున్నా మార్పులకి కారణం ప్రపంచంలో వస్తున్నా అనేక మార్పులు అనే విషయం అర్థమవుతున్నప్పుడు 'సాలభంజిక' కథలు చెప్పటం, అన్నీ ఉండి కూడా ఎదుర్కొంటున్న ఎమోషనల్ వయోలెన్స్ ని 'మంచుపూల వాన' లో, రవ్వంత ప్రేమ కూడా బయటి ప్రపంచంలో ఎలా బాధాకరమవుతుందో 'వాన చెప్పిన రహస్యం' లో చెపితే, వీటన్నిటి మధ్య నిలబడి వెతుక్కుంటున్న చోటులో దాదాపు అన్ని విధాలా కోల్పోతున్న అమాయకత్వం 'ది లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్' లో ప్రతిబింబించాయి. - కుప్పిలి పద్మ© 2017,www.logili.com All Rights Reserved.