వివిధ వర్ణాల వర్తమాన కథలు
సాహిత్య ప్రక్రియలో కథకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. ఎప్పటికప్పుడు తన కాలపు జీవితాన్ని చిత్రించటంలో కథాప్రక్రియది విశిష్టమైన పాత్ర. అందువల్లనే కథకు అంత ప్రాధాన్యం. అంతేకాక నిమిషాల్లో చదివి, అర్థంచేసుకోవటానికి, ఆలోచించ టానికి ఆస్కారం ఇస్తుంది "కథలలో వర్తమాన సామాజిక జీవితం ప్రతిఫలిస్తుంది. నడుస్తున్న చరిత్రను రికార్డు చేయడంలో కథలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. సామాజిక చరిత్రకు వనరులుగా ఉపకరిస్తాయి" అంటారు ప్రముఖ మాసపత్రిక పాలపిట్ట సంపాదకులు గుడిపాటిగారు.
ఒక మంచి కథ జీవితం అంత విశాలమైనది, లోతైనది, అందమైనది. ఒక మంచి కథను చదివిన పాఠకుడు ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. ఉద్విగ్ను డవుతాడు. ఒక మంచి కథ పాఠకుడిని కదిలిస్తుంది. కథలోని పాత్రలో మమేకమై, లీనమై శీతోష్ణస్థితులను అనుభవిస్తాడు పాఠకుడు.
లౌక్యం-
మూడు దశాబ్దాలు అధ్యాపకురాలిగా పనిచేసిన రచయిత్రి శ్రీమతి లక్ష్మీ రాఘవ గారికి శ్రోతల నాడి పట్టుకోవటం వచ్చును. సుమారు ఆరు దశాబ్దాల కాలం నుండి తన కథలు, కవిత్వం, చరిత్ర రచనలతో పాఠకులను అలరిస్తున్న ఈ రచయిత్రికి 'ఆకట్టు కోవటం' అనే కనికట్టు తెలుసును. వారి రచనలు విదేశాల్లోనూ, పొరుగు రాష్ట్రాలలో కూడా పరివ్యాప్తం అయ్యాయి. పలు ప్రశంసలు, పురస్కారాలు, బహుమతులు తెచ్చి పెట్టాయి.
కథల్లో సహజత్వం ఉండాలి, సారళ్యతా ఉండాలి. సామాజిక స్పృహ,.............
వివిధ వర్ణాల వర్తమాన కథలు సాహిత్య ప్రక్రియలో కథకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. ఎప్పటికప్పుడు తన కాలపు జీవితాన్ని చిత్రించటంలో కథాప్రక్రియది విశిష్టమైన పాత్ర. అందువల్లనే కథకు అంత ప్రాధాన్యం. అంతేకాక నిమిషాల్లో చదివి, అర్థంచేసుకోవటానికి, ఆలోచించ టానికి ఆస్కారం ఇస్తుంది "కథలలో వర్తమాన సామాజిక జీవితం ప్రతిఫలిస్తుంది. నడుస్తున్న చరిత్రను రికార్డు చేయడంలో కథలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. సామాజిక చరిత్రకు వనరులుగా ఉపకరిస్తాయి" అంటారు ప్రముఖ మాసపత్రిక పాలపిట్ట సంపాదకులు గుడిపాటిగారు. ఒక మంచి కథ జీవితం అంత విశాలమైనది, లోతైనది, అందమైనది. ఒక మంచి కథను చదివిన పాఠకుడు ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. ఉద్విగ్ను డవుతాడు. ఒక మంచి కథ పాఠకుడిని కదిలిస్తుంది. కథలోని పాత్రలో మమేకమై, లీనమై శీతోష్ణస్థితులను అనుభవిస్తాడు పాఠకుడు. లౌక్యం- మూడు దశాబ్దాలు అధ్యాపకురాలిగా పనిచేసిన రచయిత్రి శ్రీమతి లక్ష్మీ రాఘవ గారికి శ్రోతల నాడి పట్టుకోవటం వచ్చును. సుమారు ఆరు దశాబ్దాల కాలం నుండి తన కథలు, కవిత్వం, చరిత్ర రచనలతో పాఠకులను అలరిస్తున్న ఈ రచయిత్రికి 'ఆకట్టు కోవటం' అనే కనికట్టు తెలుసును. వారి రచనలు విదేశాల్లోనూ, పొరుగు రాష్ట్రాలలో కూడా పరివ్యాప్తం అయ్యాయి. పలు ప్రశంసలు, పురస్కారాలు, బహుమతులు తెచ్చి పెట్టాయి. కథల్లో సహజత్వం ఉండాలి, సారళ్యతా ఉండాలి. సామాజిక స్పృహ,.............© 2017,www.logili.com All Rights Reserved.