ముందుగా నా కథలను విశేషంగా ఆదరించి నన్ను ప్రోత్సహిస్తూవస్తున్న అశేష పాఠకలోకానికి నా కృతఙ్ఞతలు. నా మూడవ కథా సంకలనం ‘మనసు చెప్పిన కథలు’. ఇది పన్నెండు కథల రూపంలో మలచబడిన ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు. ఏ ఒక్క కులానికీ – వర్గానికీ, మతానికీ చెందినవి కావు. ఎవరినీ ఉద్దేశించీ రాసినవి కావు. పటిష్టమైన వ్యవస్థ మనది. ఇందులో ప్రస్తుతం ప్రతి వ్యక్తి ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యల్ని ఎంచుకుని వ్రాయడం జరిగింది. ఈ దఫా కథల నిడివిని కాస్త తగ్గించి – కథా వస్తువుకి అనుగుణంగా రాశాను. రెండు పెద్ద కథలు, పది చిన్నకథలు. ఈ ‘మనసు చెప్పిన కథలు’. కథలు చెప్పే క్రమంలో ఏ తప్పులున్నా – ఎవరినైనా తెలిసో – తెలియకో నొప్పించినా పాఠకులు మన్నించి సహృదయంతో నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని ఎపట్లాగే నా వెనకుండి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ సదా మీ అభిమానం కోరే..
డి ఆర్ ఎల్ ఆర్ చంద్రజ
ముందుగా నా కథలను విశేషంగా ఆదరించి నన్ను ప్రోత్సహిస్తూవస్తున్న అశేష పాఠకలోకానికి నా కృతఙ్ఞతలు. నా మూడవ కథా సంకలనం ‘మనసు చెప్పిన కథలు’. ఇది పన్నెండు కథల రూపంలో మలచబడిన ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు. ఏ ఒక్క కులానికీ – వర్గానికీ, మతానికీ చెందినవి కావు. ఎవరినీ ఉద్దేశించీ రాసినవి కావు. పటిష్టమైన వ్యవస్థ మనది. ఇందులో ప్రస్తుతం ప్రతి వ్యక్తి ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యల్ని ఎంచుకుని వ్రాయడం జరిగింది. ఈ దఫా కథల నిడివిని కాస్త తగ్గించి – కథా వస్తువుకి అనుగుణంగా రాశాను. రెండు పెద్ద కథలు, పది చిన్నకథలు. ఈ ‘మనసు చెప్పిన కథలు’. కథలు చెప్పే క్రమంలో ఏ తప్పులున్నా – ఎవరినైనా తెలిసో – తెలియకో నొప్పించినా పాఠకులు మన్నించి సహృదయంతో నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని ఎపట్లాగే నా వెనకుండి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ సదా మీ అభిమానం కోరే.. డి ఆర్ ఎల్ ఆర్ చంద్రజ© 2017,www.logili.com All Rights Reserved.