ఊహకు రెక్కలు వచ్చినట్టు పుట్టుకొచ్చిన సాహిత్యం కాదది... జన జీవనంతో మమేకమై హ్యూమనిజాన్ని మథనం చేస్తూ సమాజంలో భిన్న మనస్తత్వాల పోకడలను తన సాహిత్య సృష్టికి సానుకూలం చేస్తున్నారామే. దిగజారుతున్న మానవత్వపు విలువలు కోల్పోతున్న జీవితపు స్పృహ అలసత్వానికి గురవుతున్న స్వచ్చమైన ప్రేమానురాగాలు.. ఈ "మనసు" కథలకు ఇతివృత్తాలు. ఇక పాత్రలు కళ్ళముందు కదిలేవి... కంటతడి పెట్టించేవి... ప్రత్యేకత ఆర్ద్రతతో కూడిన కథలను కళ్ళకు కట్టేలా చెప్పడం. తన "మనసు" కథలతో మనిషి బలాన్ని, బలహీనతలను, వ్యధలను వాస్తవిక రూపంలో ఆవిష్కరించడమే కాకుండా.. కొంత వరకు పరిష్కరించే ప్రయత్నం కూడా చేసారామే.
వర్తమాన సమాజం అనేక సమస్యల వలయమే కాదు, మహాచైతన్యవంతం కూడా.. అందుకే సమాజానికి ప్రమాదకరంగా పరిణమించే భిన్న మనస్తత్వాలకు గాయపడ్డ మనసులకు ప్రేమాభిమానాలతో మానవత్వపు తడిని మెల్లగా అద్దుతూ తన మనసు కథల రచనాలయంలో చికిత్స మొదలుపెట్టిన రచయిత్రి శ్రీమతి రాజేశ్వరి చంద్రజ గారి ప్రయత్నం సఫలీకృతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
- యం వి రంగనాథ్
ఊహకు రెక్కలు వచ్చినట్టు పుట్టుకొచ్చిన సాహిత్యం కాదది... జన జీవనంతో మమేకమై హ్యూమనిజాన్ని మథనం చేస్తూ సమాజంలో భిన్న మనస్తత్వాల పోకడలను తన సాహిత్య సృష్టికి సానుకూలం చేస్తున్నారామే. దిగజారుతున్న మానవత్వపు విలువలు కోల్పోతున్న జీవితపు స్పృహ అలసత్వానికి గురవుతున్న స్వచ్చమైన ప్రేమానురాగాలు.. ఈ "మనసు" కథలకు ఇతివృత్తాలు. ఇక పాత్రలు కళ్ళముందు కదిలేవి... కంటతడి పెట్టించేవి... ప్రత్యేకత ఆర్ద్రతతో కూడిన కథలను కళ్ళకు కట్టేలా చెప్పడం. తన "మనసు" కథలతో మనిషి బలాన్ని, బలహీనతలను, వ్యధలను వాస్తవిక రూపంలో ఆవిష్కరించడమే కాకుండా.. కొంత వరకు పరిష్కరించే ప్రయత్నం కూడా చేసారామే. వర్తమాన సమాజం అనేక సమస్యల వలయమే కాదు, మహాచైతన్యవంతం కూడా.. అందుకే సమాజానికి ప్రమాదకరంగా పరిణమించే భిన్న మనస్తత్వాలకు గాయపడ్డ మనసులకు ప్రేమాభిమానాలతో మానవత్వపు తడిని మెల్లగా అద్దుతూ తన మనసు కథల రచనాలయంలో చికిత్స మొదలుపెట్టిన రచయిత్రి శ్రీమతి రాజేశ్వరి చంద్రజ గారి ప్రయత్నం సఫలీకృతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. - యం వి రంగనాథ్© 2017,www.logili.com All Rights Reserved.